Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు ఆకలిగా లేదంటున్నారా..? పిప్పళ్ల చూర్ణం వుందిగా? (video)

పిల్లలు ఆకలి లేదంటున్నారా..? అయితే పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేయకుండా ఇలా చేయాలి. చిన్నారుల పొట్టలో అన్నింటికీ చోటు ఉండదు. పాలతోనే ఆకలి నిండితే మిగిలినవి తినలేరని తల్లులు గుర్తుంచుకోవ

పిల్లలు ఆకలిగా లేదంటున్నారా..? పిప్పళ్ల చూర్ణం వుందిగా? (video)
, సోమవారం, 16 జులై 2018 (15:59 IST)
పిల్లలు ఆకలి లేదంటున్నారా..? అయితే పిల్లలకు బలవంతంగా ఆహారం తినిపించే ప్రయత్నం చేయకుండా ఇలా చేయాలి. చిన్నారుల పొట్టలో అన్నింటికీ చోటు ఉండదు. పాలతోనే ఆకలి నిండితే మిగిలినవి తినలేరని తల్లులు గుర్తుంచుకోవాలి. జలుబు ఉంటే తగ్గేవరకూ ఆగాలి. నులిపురుగులు ఉన్నట్లయితే మందులు వాడాలి. పిల్లలకు నచ్చేవిధంగా ఆహారాన్ని తయారు చేయాలి. 
 
ఆహారానికి ముందు చిరుతిళ్లు ఇవ్వకూడదు. ముఖ్యంగా చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు వంటివి అసలు పెట్టకూడదు. బాగా ఆడుకునేలా చూడాలి. దీంతో శరీరం బాగా అలిసిపోయి ఆకలేస్తుంది. అలాంటప్పుడు పోషకాహారం ఇవ్వాలి. ఆయుర్వేద దుకాణాల్లో పిప్పళ్లని దొరుకుతాయి. వాటిని నేతిలో దోరగా వేయించి చల్లారాక మెత్తటి చూర్ణంలా చేసి, పల్చని వస్త్రంలో జల్లించి భద్రపరుచుకోవాలి. 
 
పిల్లల వయసును బట్టి, పావు చెంచా నుంచీ అరచెంచా వరకూ తీసుకుని నెయ్యి, తేనె కలిపి రెండు పూటలా తినిపించాలి. అయితే నెయ్యి ఎక్కువగా, తేనె తక్కువ పరిమాణంలో కలపాలి. ఇలా చేస్తే పిల్లల కడుపులో నులిపురుగులు చేరవు. ఆకలి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే పిప్పళ్లు, మోడి, శొంఠి, మిరియాలు సమపాళ్లల్లో కలిపిన చూర్ణాన్ని, రెండు గ్రాముల మోతాదులో అరస్పూను తేనెలో కలిపి సేవిస్తూ ఉంటే చాలా కాలంగా వేధిస్తున్న జలుబు, బొంగురు గొంతు సమస్యలు తగ్గిపోతాయి. పిప్పళ్లు, వస సమభాగాలుగా తీసుకుని, మూడు గ్రాముల మోతాదులో వేడినీటితో గానీ, పాలతో గానీ కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటే మైగ్రేన్‌ తగ్గుతుంది. 
 
రెండు గ్రాముల పిప్పళి చూర్ణానికి తేనె కలిపి, రోజుకు మూడు పూటలా సేవిస్తే అధిక బరువు తగ్గుతుంది. అయితే ఈ తీసుకున్న గంటవరకు నీళ్లు తప్ప ఇతర ఆహారం ఏదీ తీసుకోకూడదు. ఐదు గ్రాముల పిప్పళ్ల చూర్ణాన్ని అరకప్పు మజ్జిగలో కలిపి రెండు పూటలా సేవిస్తే ప్రసవానంతరం ఎత్తుగా మారిన పొత్తి కడుపు తగ్గిపోయి, పొట్ట చదునుగా అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ ఆహారంతో రక్తహీనత(ఎనీమియా)కు చెక్...