మానవుడు కాలుమోపని ప్రదేశమంటూ లేదు. సాంకేతిక పరంగా అన్నీ రంగాల్లోనూ మానవుడు ముందడుగు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అంగారకుడిపై కూడా త్వరలో ఇళ్లు ఏర్పాటుకానున్నాయి. ఇందులో భాగంగా అంగారకుడుపై మానవులకు గృహాలు నిర్మించేందుకు రోబోలు సిద్ధమవుతున్నాయి.
దాదాపు ప్రతి కదలికకు స్పష్టమైన సూచనలు ఇవ్వాల్సిన చాలా రోబోట్ల మాదిరిగా కాకుండా, స్వయంప్రతిపత్తితో పనిచేసే రోబోలు.. త్వరలో అంగారకుడిపై మానవుడి కోసం మొట్టమొదటి సారిగా ఇళ్లను నిర్మించనున్నాయి.
జర్మన్ అంతరిక్ష సంస్థ (డిఎల్ఆర్), మానవులకు మొట్టమొదటి మార్టిన్ ఆవాసాలను నిర్మించడానికి ఇటువంటి హ్యూమనాయిడ్ బాట్లను తయారు చేస్తున్నారు. ఇందుకోసం విజ్ఞాన సర్వస్వ అంశాలను పరిశీలిస్తున్నారు. అంతేగాకుండా ఇంజనీర్లు ఇందుకోసం అంగారకునిపై నివసించేందుకు వీలుగా శారీరక సామర్థ్యాలను ఒక దశాబ్ధం పాటు మెరుగుపరుస్తున్నారు. ఈ నివాసాల ద్వారా టూల్స్‌ను, ఫోటోలను, ఎగిరే వస్తువులను పట్టుకోవచ్చు.
ప్రతి కదలికకు స్పష్టమైన సూచనలు ఇవ్వవలసిన చాలా రోబోట్ల మాదిరిగా కాకుండా, ఎఐ-ఫోర్టిఫై బాట్ అనే రోబో స్వయంగా సంక్లిష్టమైన పనులను చేయగలదు. కక్ష్యలో ఉన్న వ్యోమగాముల పర్యవేక్షణలో ఉన్నప్పుడు గ్రహం ఉపరితలంపై దీన్ని ప్రోగ్రామ్ చేయడం కుదరదు. ఆబ్జెక్ట్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ విజన్ జస్టిన్ దాని వాతావరణాన్ని సర్వే చేసి, యంత్రాలను శుభ్రపరచడం, నిర్వహించడం, పరికరాలను పరిశీలించడం, వస్తువులను మోసుకెళ్లడం వంటి ఉద్యోగాలను చేపడుతుంది.
జస్టిన్ అనే ఈ ఎఐ-ఫోర్టిఫై బాట్.. ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తును కలిగివుంటుంది.
బరువు: 440 పౌండ్లు
మోసుకెళ్లే సామర్థ్యం : 31 పౌండ్లను ఒక్కో భుజంలో మోసుకెళ్తుంది.
అనూహ్య నైపుణ్యం: టీ లేదా కాఫీని తయారు చేయడం
ఈ రోబో కళ్లు.. హై-డెఫ్ కెమెరాలు, సెన్సార్లతో హెడ్ జనరేట్ త్రీడీ వ్యూను కలిగివుంటాయి.
ఆర్2డీ2 స్టైల్ డేటాను ఇంటర్ఫేస్ చేస్తుంది. అంటే కంప్యూటర్లు, డేటా కలెక్షన్ సెంటర్లకు ఇది అనుసంధానం అవుతుంది. సోలార్ పవర్‌తోనూ స్వయంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోగలుగుతుంది.
చేతులు : ఎనిమిది వేళ్లతో కూడిన చేయి టూల్స్‌ను హ్యాండిల్ చేసుకోగలదు.
జస్టిస్ ప్రోటోకాల్ ప్రకారం బోర్డులో పూర్తి చేసిన టాస్క్‌లను, డేటాను సేవ్ చేస్తుంది. కమ్యూనికేషన్ లింక్స్‌ను కాపాడుతుంది.
చక్రాలు: డీఎల్ఆర్‌తో పరిశోధితమైన అంగారకునిపై నడిచేలా యాక్టివ్‌గా వుంటాయి.