Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? ఇమేజ్ గేట్ వైరస్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వాడేవారు?

సోషల్ మీడియా ప్రభావం.. చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రీ డేటా ఇంకేముంది.. సినిమాలు, పాటలు, ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని

Advertiesment
ImageGate: Ransomware Spreading Via JPG Files on Social Networks
, మంగళవారం, 29 నవంబరు 2016 (16:32 IST)
సోషల్ మీడియా ప్రభావం.. చేతిలో స్మార్ట్ ఫోన్లు, ఫ్రీ డేటా ఇంకేముంది.. సినిమాలు, పాటలు, ఫోటోలు చకచకా డౌన్లోడ్ చేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. ఫోటోలు డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఫోటోల ద్వారా వ్యాపించే ఇమేజ్ గేట్ అనే కొత్త వైరస్‌తో తిప్పలు తప్పవని సాంకేతిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఈ వైరస్ ఈజీగా ప్రవేశిస్తున్నాయని కంప్యూటర్ నిపుణులు అంటున్నారు. సోషల్‌మీడియాలోని కొన్ని లోపాల ఆధారంగా ఈ ఇమేజ్‌ను అప్‌లోడ్‌ చేస్తారు. సోషల్‌మీడియాను వినియోగించేవారు పొరబాటున ఈ ఇమేజ్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే వైరస్‌ సిస్టంలోకి వచ్చేస్తుంది. దీంతో మనం వాడుతున్న సిస్టం కానీ ఇతర పరికరం కానీ వారి ఆధీనంలోకి వెళుతుంది. దీన్ని హ్యాకర్లు సొమ్ము చేసుకునే అవకాశాలున్నట్లు కంప్యూటర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సోషల్‌మీడియాలో ప్రత్యేకించి ఫేస్‌బుక్‌, లింక్డిన్‌ వాడేవారు జాగ్రత్తగా వుండాలి. ఫోటో ఎక్స్‌టెన్షన్‌ తేడాగా వుంటే డౌన్‌లోడ్‌ చేయవద్దు. ఇంకా ఇతరులు పంపే జెపెగ్‌ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే డౌన్‌లోడ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్టీఏ, జెఎస్ వంటి వాటిని మెనూలోకి వెళ్లి టూల్స్, ఎక్స్‌‍టెన్షన్ నుంచి తొలగించాలి. ఇలా చేస్తే ఫోటోల ద్వారా సిస్టమ్ ప్లస్ ఫోన్లలోకి ప్రవేశించే వైరస్‌ను కట్టడి చేసేందుకు వీలుంటుందని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్దనోట్లు రద్దుతో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి...? కోర్టు సూటి ప్రశ్నకు మైసూరా ఉక్కిరిబిక్కిరి