Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్దనోట్లు రద్దుతో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి...? కోర్టు సూటి ప్రశ్నకు మైసూరా ఉక్కిరిబిక్కిరి

నల్లధనాన్ని వెలికి తీయడానికి మీకెంత టైం కావాలంటూ గతంలో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నేపధ్యంలో పెద్దనోట్ల రద్దుపైన ఎవరైనా కోర్టులకు వెళితే మొట్టికాయలు పడుతున్నాయి. తాజాగా వైసీపి నాయకుడు మైసూరా రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున

Advertiesment
YSRCP Mysura Reddy
, మంగళవారం, 29 నవంబరు 2016 (16:12 IST)
నల్లధనాన్ని వెలికి తీయడానికి మీకెంత టైం కావాలంటూ గతంలో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ నేపధ్యంలో పెద్దనోట్ల రద్దుపైన ఎవరైనా కోర్టులకు వెళితే మొట్టికాయలు పడుతున్నాయి. తాజాగా వైసీపి నాయకుడు మైసూరా రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై కోర్టు ఇవాళ విచారించింది. 
 
మైసూరా రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ... పెద్దనోట్ల రద్దుతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారనీ, కనుక నోట్లరద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు ప్రశ్నిస్తూ... పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం తెలిపింది కదా అని అంటూనే, అసలు పెద్దనోట్ల రద్దు వల్ల మీకు ఎదురవుతున్న సమస్యలు ఏంటి అని నిలదీసింది. దీనితో మైసూరా రెడ్డి తరపు న్యాయవాది ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఏదో చేయాలనుకుంటే ఏదో జరగడం అంటే ఇదేనేమో...?!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెద్ద నోట్ల రద్దు: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం.. గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ.. కొత్త పథకానికి మోడీ ప్లాన్..?