Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇక స్మార్ట్‌ఫోన్లో మాట్లాడితే చాలు.. టైపింగ్ బాధ తప్పుతుంది.. ఎలాగో తెలుసుకోండి

గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో మెసేజ్‌లు టైప్ చేస్తున్నారా? ఇలాంటి వారి కోసం త్వరలోనే కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్లలో ఇకపై మాట్లాడితే చాలు. ఆ మెసేజ్‌ను కంపోజ్ చేసే సాఫ్ట్‌వేర్ అందుబా

Advertiesment
Baidu's Deep Speech 2
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (15:01 IST)
గంటల తరబడి స్మార్ట్ ఫోన్లలో మెసేజ్‌లు టైప్ చేస్తున్నారా? ఇలాంటి వారి కోసం త్వరలోనే కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది. స్మార్ట్ ఫోన్లలో ఇకపై మాట్లాడితే చాలు. ఆ మెసేజ్‌ను కంపోజ్ చేసే సాఫ్ట్‌వేర్ అందుబాటుకోలికి రానుంది. ఈ విషయాన్ని వాషింగ్టన్‌కు చెందిన స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జేమ్స్ లిండాయ్ వెల్లడించారు.

ఈ సాఫ్ట్ వేర్ వస్తే గంటల తరబడి కీ ప్యాడ్‌పై ప్రతి అక్షరాలను వెతుక్కుని టైప్ చేసి మెసేజ్ సెండ్ చేసే తలనొప్పి తగ్గేలా ఉంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. చిట్ చాట్ లవర్స్‌కు టైపింగ్ బాధ తప్పుతుంది. క్వర్టీకీ ప్యాడ్ కలిగిన ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్లలో ఈ యాప్ అందుబాటులోకి రానున్నట్లు లిండాయ్ తెలిపారు. 
 
ఇకపోతే.. సాఫ్ట్ వేర్ పేరు బైదూస్ డీప్ స్పీచ్ 2 అనే ఈ యాప్.. క్లౌడ్ బేస్డ్ స్పీచ్ రికగ్నిషన్ సహాయంతో 32 రకాల అక్షరాలను వాడి మాట్లాడే స్పీచ్‌లను విని కంపోజ్ చేయగలదు. స్పీచ్‌ను విని నోట్ రాసే సాఫ్ట్ వేర్‌ను మొద‌ట ఆంగ్లంలో టెస్టు చేశారు. అనంత‌రం చైనీస్‌లోని మాండ‌రిన్‌లోనూ ప‌రీక్షించారు. ఇంగ్లీష్‌లో అక్ష‌ర‌దోషాల రేటు 20 శాతం కాగా చైనీస్ లో అది 60 శాతంగా ఉన్న‌ట్టు గుర్తించారు. అంతేగాకుండా మ‌నం టైప్ చేసిన దానికంటే మూడు రెట్ల వేగంతో పనిచేసే  ఆ సాఫ్ట్ వేర్ మెసేజ్‌ను కంపోజ్ చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రత్యేక హోదా... తెదేపా చీలిపోతుందా...? పవన్ కళ్యాణ్ పంచ్‌లు... బాబు టెన్షన్ టెన్షన్