Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ప్రత్యేక హోదా... తెదేపా చీలిపోతుందా...? పవన్ కళ్యాణ్ పంచ్‌లు... బాబు టెన్షన్ టెన్షన్

ఒక పక్క కొత్తగా తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు... ఇంకోపక్క ప్రత్యేక హోదా అంటూ పవన్ కళ్యాణ్ పవర్ పంచ్‌లు... లొసులుగులున్నాయా అంటూ ఏకంగా విమర్శలు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ... అధికార, ప్రతిపక్ష, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్ర

Advertiesment
chandrababu naidu
అమరావతి , మంగళవారం, 30 ఆగస్టు 2016 (14:57 IST)
ఒక పక్క కొత్తగా తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు... ఇంకోపక్క ప్రత్యేక హోదా అంటూ పవన్ కళ్యాణ్ పవర్ పంచ్‌లు... లొసులుగులున్నాయా అంటూ ఏకంగా విమర్శలు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ... అధికార, ప్రతిపక్ష, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీ వైకాపా, కేంద్రం స్పందించే తీరును పక్కనబెడితే, తెలుగుదేశం పార్టీలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఒక దశలో టీడీపీ నేతలే ఒకరిపై విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ అయోమయం సృష్టిస్తున్నారు.
 
ప్రభుత్వంలోని మంత్రులంతా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాస్త సాఫ్ట్‌గా ఉంటే, ఎంపీలు మాత్రం మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీలో చీలిక కనబడుతోంది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పదవులను వదులుకుంటామని ఒక నాయకుడు అంటుంటే... హోదా సాధన కోసం పవన్ చేసే ఉద్యమంలో తాము కూడా వెంట నడుస్తామని మరొకరు చెపుతున్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీలోని నాయకులే మాట్లాడుతూ ఉండటంతో గందరగోళంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వెంట తెదేపాకు చెందినవారెవరైనా జంప్ చేసేస్తారేమోనన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఓటుకు నోటు కేసు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏసీబీ కోర్టు కేసును తిరిగి దర్యాప్తు చేయాలనీ, అదికూడా నెల రోజుల్లోపు ముగించాలని చెప్పడంతో ఆ నెల రోజుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. మరోవైపు వైకాపా మంగళగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ... 100 రూపాయలు చీటింగ్ చేసినవారిని జైల్లో పెడుతున్నారనీ, అలాంటప్పుడు కోట్ల రూపాయలను ఎరగా వేసి ఓ ఎమ్మెల్సీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడుని ఎలా వదిలిపెడతారంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును చుట్టుముడుతున్న ఈ సమస్యల నుంచి ఆయన ఎలా బయటపడతారో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో బ్యాచిలర్ విలేజ్: 100కి పైగా పెళ్ళికాని ప్రసాద్‌లు.. రోడ్డు సరిగ్గా లేదని పిల్లనివ్వట్లేదు..