ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెస్ (Customer Support - Chat Processing) పోస్టుల కోసం సంస్థ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాల కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసి ఉత్తీర్ణులై వుండాలి.
ఈ ఉద్యోగాలకు (Jobs) ఎంపికైన వారు దాదాపు రూ.3 లక్షల యాన్యువల్ ప్యాకేజీ అందుకోవచ్చు. జొమాటోలో కస్టమర్ సపోర్ట్ - చాట్ ప్రాసెసింగ్ జాబ్‌కు సెలెక్ట్ అయిన వారు జొమాటో కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వారి సమస్యలను పరిష్కరించాల్సిన రెస్పాన్సిబిలిటీ వీరిపై ఉంటుంది.
ఇలాంటి ప్రొఫైల్ గల జాబ్‌లో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు zomato.com/careersలోని అధికారిక వెబ్‌సైట్‌లో జాబ్ డీటెయిల్స్ చెక్ చేయవచ్చు. అయితే ఈ జాబ్‌ను ఆఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు వారి రెజ్యూమ్ సెండ్ చేయాల్సి ఉంటుంది.