Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత మార్కెట్లోకి షియోమీ నోట్-4.. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ ఫీచర్‌తో ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో

భారత మార్కెట్లోకి షియోమీ నోట్-4.. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ ఫీచర్‌తో ధరెంతో తెలుసా?
, మంగళవారం, 10 జనవరి 2017 (16:45 IST)
భారత మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన రెడ్‌మీ సిరీస్‌లో నోట్-4 స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి షియోమీ విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయినా ఢిల్లీలో 19న షియోమీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలిసింది. 
 
ఇక షియోమీ నోట్4లో 2జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గ మెమొరీ ఉంది. ఇంకా 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్ప్లే(1920X1080 పిక్సెల్స్), 4,100 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాను ఈ ఫోన్ కలిగివుంటుందని షియోమీ వెల్లడించింది. 
 
ఇందులో 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ వున్నాయని షియోమీ తెలిపింది. ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌ను ఫీచర్‌ను కలిగివుంటుంది. దీని ధర రూ.10వేల నుంచి రూ.13వేల లోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టైల్ మార్చిన శశి... జడ కొప్పయింది... ఆంధ్రలో ఎంజీఆర్ శత జయంతట... తెదేపాకు పోటీయా?