Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. గ్రూప్ కాల్స్ కోసం లింక్ క్రియేట్ చేయొచ్చు..

Advertiesment
WhatsApp
సాధారణంగా గూగుల్ మీట్, జూమ్ యాప్స్‌లో గ్రూపు కాల్స్ కోసం యూజర్లు తమ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసిన లింకును ఇతరులకు పంపుకునే వీలుంది. అదే తరహాలో వాట్సాప్‌లో కూడా ఈ సరికొత్త ఫీచర్ మెసేజింగ్ ప్లాట్ ఫాంపై రానుంది. 
 
ఇప్పటికే ఈ ఫీచర్ కోసం వాట్సాప్ టెస్టింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపులో హోస్ట్ చేసే వ్యక్తి ఈ లింక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలా గ్రూపులోని అందరికి ఆ లింకును పంపవచ్చు. మీ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారే కాదు. మీ మొబైల్ కాంటాక్టు లిస్టులో లేనివారికి కూడా ఈ గ్రూపు జాయిన్ లింక్ పంపుకోవచ్చు. 
 
టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. వాట్సాప్‌లో రాబోయే ఈ కొత్త ఫీచర్‌ డెవలపింగ్ స్టేజీలో ఉందని వాట్సాప్ ట్రాకర్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం - వోడ్కాకు వచ్చిన కష్టాలు