Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్ స్టిక్కర్లను యాప్ స్టోర్ నుంచి ఆపిల్ తొలగించనుందా?

Advertiesment
వాట్సాప్ స్టిక్కర్లను యాప్ స్టోర్ నుంచి ఆపిల్ తొలగించనుందా?
, మంగళవారం, 20 నవంబరు 2018 (12:24 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌కు సంబంధించిన వాట్సాప్ స్టిక్కర్లను యాప్ స్టోర్ నుంచి ఆపిల్ తొలగిస్తోంది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యాప్‌లో ఈ స్టిక్కర్లను ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్టిక్కర్లు కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినట్లు వుంటున్నాయని డెవలపర్స్ తెలపడంతో యాప్ స్టోర్ నుంచి స్టిక్కర్లను తొలగించే పనిలో వుంది యాపిల్ సంస్థ. 
 
డబ్ల్యూఏబీటెల్ఇన్ఫో నివేదిక ప్రకారం స్టిక్కర్ అనువర్తనాలను తొలగించేందుకు నిర్ణయించినట్లు ఆపిల్ సంస్థ తెలిపింది. వాట్సాప్ స్టిక్కర్‌ల ద్వారా యాప్‌ స్టోర్ మార్గదర్శకాలు నిబంధనలకు మారుగా వున్నాయని.. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అటు వాట్సాప్ నుంచి కానీ, ఆపిల్ నుంచి కానీ స్టిక్కర్లను యాప్ స్టోర్ నుంచి తొలగించడంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 
 
కానీ అక్టోబర్‌లో వాట్సాప్ తన బ్లాగులో ఈ విషయం గురించి ప్రస్తావించింది. వినియోగదారుల కోసం స్టిక్కర్ల అనువర్తనాలను రూపొందించేందుకు మూడో పార్టీ డెవలపర్లకు మద్దతు తెలపడం జరిగిందని తెలిపింది. డిజైనర్స్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసే వినియోగదారులు వాట్సాప్‌లోనే ఆ స్టిక్కర్లను పంపడం ప్రారంభించగలరని వాట్సాప్ తెలిపింది. 
 
ఈ ప్రకటన తర్వాత ఆపిల్, గూగుల్ ప్లే స్టోర్‌లో సిక్కర్లను కస్టమర్లు భారీగా వినియోగించడం జరిగింది. కానీ ఈ స్టిక్కర్స్ అనువర్తనాలు యాప్ స్టోర్‌‌ నిబంధనలకు మారుగా వుండటంతో ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించేందుకు సిద్ధపడిందని వార్తలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైకు జనసేనాని... విశ్వనటుడుతో పవన్ కళ్యాణ్ భేటీ?