సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌ను వాడని వారంటూ వుండరు. స్మార్ట్‌ఫోన్ వాడేవారు వాట్సాప్ లేకుండా వుండలేకపోతున్నారు. వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. వినియోగదారులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది.
తాజాగా వాట్సాప్‌కు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఫోటోలను షేర్ చేసే కొత్త ఫీచర్‌ను అమలు చేసేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో ఇప్పటికే స్టిక్కర్స్‌ను ప్రవేశపెట్టేందుకు ట్రయల్స్ జరుగుతున్న తరుణంలో.. క్యూఆర్‌డాట్‌కోడ్ ద్వారా వీడియోలను, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో వున్నట్లే నేమ్‌టాగ్ వుంటుంది. తద్వారా వినియోగదారులు కాంటాక్ట్ వివరాలను షేర్ కాంటాక్ట్ ఇన్ఫో వయా క్యూఆర్ ద్వారా డేటాను షేర్ చేసుకోవచ్చునని ఫేస్‌బుక్ సొంత కంపెనీ అయిన వాట్సాప్ తెలిపింది.