Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్ కాల్స్ - స్పామ్‌‍ మెసేజ్‌లతో విసిగిపోయారా..?

Advertiesment
whatsapp
ఉదయం నిద్రలేచినది మొదలుకుని రాత్రి పడుకునేవరకు వాట్సాప్‌‍లో వచ్చే స్పామ్ సందేశాలు, అనుమానాస్పద కాల్స్‌‍లో అనేక మంది విసిగి వేసారిపోతుంటారు. అలాంటి వారి యూజర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు వీలుగా వాట్సాప్ మాతృసంస్థ మెటా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మ్యూట్ చేసేందుకు త్వరలోనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ఆధారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఫీచర్ వినియోగంలోకి వస్తే వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పదం కాల్స్‌ను సైలెంట్‌లో పెట్టుకునే సౌలభ్యం లభించనుంది. ఇప్పటివరకు ఆ కాల్స్ లిస్ట్ నోటిఫికేషన్‌ సెంటర్‌లో ఫోన్ నంబర్లు కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తే స్పామ్ మెసేజెస్, కాల్స్ బ్లాక్ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కైలాస: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంతం ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి?