గూగుల్ అసిస్టెంట్ గురించి అందరికీ తెలిసిందే. వాయిస్ కమాండ్స్, టెక్ట్స్ కమాండ్స్ రూపంలో ఏదైన సమాచారం అడిగితే మీకు అది అందిస్తుంది. కానీ హే గూగుల్, ఓకే గూగుల్ అంటే అసిస్టెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్‌ను స్నాప్‌షాట్ అని అంటారు. గూగుల్ ఈ పేజీలో మార్పులు చేస్తోంది. తాజాగా యూజర్‌కు మరింత ఉపయోగపడేలా ఇందులో కొత్త కొత్త ఫీచర్లు యాడ్ చేస్తోంది.
స్నాప్‌షాట్‌ను యూజర్లు వినియోగించేందుకు గూగుల్ నూతనంగా వాయిస్ కమాండ్‌ను తయారు చేసింది. ఈ రోజు మీరు చేయాల్సిన పనులేంటి, మీ స్నేహితుల పుట్టిన రోజులేంటి, చెల్లించాల్సిన బిల్స్, మీ వార్షికోత్సవాలు ఇలా చాలా ఆప్షన్లను ఈ స్నాప్‌షాట్‌లో పొందుపరుస్తున్నారు. అదనపు ఆప్షన్ల గురించి చూస్తే రిజర్వేషన్లు, తరచుగా వాడే అసిస్టెంట్ యాక్షన్లు/కమాండ్లు, కరెన్సీ కన్వర్టర్ లాంటివి ఉన్నాయి.
హే గూగుల్/ఓకే గూగుల్ కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేసి 'హే గూగుల్ షో మి మై డే' అనాలి. అప్పుడు స్నాప్‌షాట్ తెర మీద సమాచారం కనిపిస్తుంది. సాధారణంగా యూజర్లకు వాతావరణం, రిమైండర్స్, షాపింగ్ లిస్ట్, కోవిడ్ సమాచారం లాంటివి డీఫాల్ట్‌గా ఇస్తున్నారు. ఇవి కాకుండా సెట్టింగ్స్ ద్వారా ఇంకొన్ని ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు లేదా తీసేయొచ్చు.
డీఫాల్ట్‌గా అయితే అందరికీ అన్ని ఆప్షన్లు ఆన్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి స్నాప్‌షాట్ ఆంగ్లంలోనే అందుబాటులో ఉంది. త్వరలో ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఈ సేవలు వినియోగించేలా గూగుల్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.