Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అపుడే 5జీ ఫీవర్... 4జీకి 5జీకి తేడా ఏంటి? (video)

Advertiesment
5G Technology
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:47 IST)
దేశంలోని మొబైల్ యూజర్లలో 5జీ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే పలు మొబైల్స్ కంపెనీలు 5జీ టెక్నాలజీతో తయారు చేసిన మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా, 2020 నాటికి రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ను 5జీ సేవలను అందుబాటులోకి తీసుకునివచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, దేశంలోని ప్రతి ఒక్కరీ 5జీ సేవలు అందుబాటులోకి రావాలంటే 2025 వరకు ఆగాల్సివుంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీకి మున్ముందు రానున్న 5జీకి వ్యత్యాసం ఏంటి.? ఇంతకీ 5జిలో ఏముంది? దీంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటి? అనే విషయాలను పరిశీలిస్తే, 
  
ప్రస్తుతం వాడుతున్న  3జి, 4జిల కన్నా 5జీ సేవలు మరింత వేగంగా ఉంటాయి. ముఖ్యంగా, వేగం మాత్రమే కాదు, కనెక్షన్‌ సాంద్రత పెరగటం, లేటెన్సీ తగ్గడం వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 5జి ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ని సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో పంపించవచ్చు. 
 
చాలా సందర్భాల్లో యూజర్లు ఒకటే ఫిర్యాదు చేస్తూ ఉంటారు.. మాకు 4జి సిగ్నల్‌ చాలా చూపిస్తోంది గానీ, స్పీడ్‌ మాత్రం సరిగా రావడం లేదని! దీనికి ప్రధాన కారణం నెట్‌వర్క్‌ కెపాసిటీ సరిగా లేకపోవడం! ప్రస్తుతం మనం వాడుతున్న 4జి నెట్‌వర్క్‌లో యాంటెన్నాలు గరిష్టంగా కేవలం 12పోర్టులు మాత్రమే కలిగి ఉంటాయి. అదే 5జిలో వంద పోర్టుల వరకూ సపోర్ట్‌ చేస్తుంది. 
 
అంతేకాదు ఒకే వలయంలో అనేక యాంటెన్నాలు ఉండే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కారణం చేత పరోక్షంగా అధికశాతం మంది వినియోగదారులు 5జి బేస్‌ స్టేషన్‌కి కనెక్ట్‌ అయి ఎలాంటి ఇబ్బంది లేకుండా హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ ఆస్వాదించగలుగుతారు. ఈ టెక్నాలజీని మాసివ్‌ ఇన్‌పుట్‌ మాసివ్‌ ఔట్‌పుట్‌ (మిమో) అనే పేరుతో పిలుస్తారు.
  
ఇప్పటికే ఫోన్‌ తయారీ కంపెనీలు 5జి ఫోన్లని విడుదల చేయడం మొదలు పెట్టాయి. టెలికం కంపెనీలు 5జి సేవలను ప్రారంభించడమే మిగిలి ఉంది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం 2020 చివరినాటికి రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ 5జి సేవలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

5జి ఫోన్లని కొనుగోలు చెయ్యడం, 5జి డేటాని వాడటం మొదట్లో కొద్దిగా ఖరీదైన వ్యవహారంగా ఉన్నప్పటికీ 2025 నాటికి 5జి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైరా ఫంక్ష‌న్‌లో అంద‌రికీ షాక్ ఇచ్చిన ప‌వ‌న్... ఇంత‌కీ ఏం చేసాడు..?