Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వోడాఫోన్ సూపర్‌నైట్ ప్యాక్... రూ.6కే అన్‌లిమిటెడ్ డేటా (కండిషన్స్ అప్లై)

దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ధరల యుద్ధం ప్రారంభమైంది. జియో బారి నుంచి తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల

Advertiesment
Vodafone's New SuperNight Pack
, మంగళవారం, 20 జూన్ 2017 (09:01 IST)
దేశీయ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ధరల యుద్ధం ప్రారంభమైంది. జియో బారి నుంచి తమ కస్టమర్లను కాపాడుకునేందుకు ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌తో పాటు అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను తగ్గించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా కూడా వోడాఫోన్ సూపర్ నైట్ పేరుతో ఓ అన్‌లిమిటెడ్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. అయితే, దీనికి ఓ షరతు విధించింది. 
 
'వొడాఫోన్ సూపర్ నైట్' పేరుతో గంటకు కేవలం రూ.6కే అపరిమిత డేటాను ప్రకటించింది. 5 గంటలకు రూ.29తో ఈ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా వినియోగదారులు ఈ ఐదు గంటల్లో అపరిమితంగా 3జీ/4జీ డేటాను ఉపయోగించుకోవచ్చు, డౌన్‌లోడ్లు చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ను రోజులో ఏ సమయంలోనైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటలకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని కంపెనీ తెలిపింది. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.19 ప్రారంభ ధరతో తీసుకొచ్చిన ప్రిపెయిడ్ రీచార్జ్‌పై వొడాఫోన్ తాజా ఆఫర్ ప్రభావం చూపించే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా, వొడాఫోన్ సూపర్‌నైట్ ప్యాక్‌ను రిటైల్ అవుట్ లెట్ల ద్వారా కానీ, *444*4#కు డయల్ చేయడం ద్వారా కానీ యాక్టివేట్ చేసుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సచివాలయంలో ఇక పూర్తిస్థాయిలో ఇ-ఫైలింగ్....