Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వొడాఫోన్ ఖాతాదారుల కోసం కొత్త ప్లాన్లు ఇవే...

Advertiesment
Vodafone Idea
, ఆదివారం, 1 మే 2022 (14:33 IST)
దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీల్లో ఒకటైన వొడాఫోన్ - ఐడియా తాజాగా తన కష్టమర్ల కోసం సరికొత్త వోచర్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్లీపెయిడ్ కష్టమర్లకు మరింతగా ఉపయోగపడేలా రూ.29, రూ.39, రూ.98, రూ.195, రూ.319 ధరలతో కొత్త ప్లాన్లను ప్రకటించింది. చౌక ప్లాన్లను కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని వీటిని తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది.
 
రూ.29 అన్నది యాడాన్ ప్లాన్. రోజువారీ ఉచిత డేటా పరిమితి అయిపోయిన తర్వాత రీచార్జ్ చేసుకోవడానికి, రెండు రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా ఈ ప్లాన్ కింద లభిస్తుంది.
 
రూ.39 అన్నది 4జీ డేటా వోచర్. రోజువారీ అధిక వేగంతో కూడిన డేటా పరిమితి అయిపోయిన వెంటనే దీన్ని రీచార్జ్ చేసుకుంటే తిరిగి డేటా లభిస్తుంది. 3జీబీ డేటా 7 రోజుల కాల పరిమితితో పొందొచ్చు. 
 
రూ.98 ప్లాన్‌లో 21 రోజుల కాలవ్యవధితో 9జీబీ డేటా లభిస్తుంది. ఇక రూ.195 ప్లాన్ 31 రోజుల కాలవ్యవధితో వస్తుంది. 2జీబీ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు ఉచితం. కాల్స్ ఉచితంగా పరిమితి లేకుండా చేసుకోవచ్చు. 
 
రూ.319 ప్లాన్‌లో రోజువారీగా 100 ఎస్ఎంఎస్‌లు, 2జీబీ డేటాను పొందొచ్చు. కాల్స్ కూడా అన్‌ లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్లలో సర్కిళ్ల వారీగా మార్పులు ఉండొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరత్నాలు కాదు.. నవ మాసాలు... 18 స్కాములు