Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏటీఎం, పేటీఎంలు ఇక అక్కర్లేదు... చెల్లింపులకు 'ఆధార్'.. సరికొత్త పేమెంట్ యాప్

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కష్టాలతో పాటు.. కరెన్సీ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులు ఊపందుకున్నాయి. అయితే, ఇకపై ఏటీఎం, పేటీఎం చెల్లింపులకు కూడా ప్రాధాన్యత తగ్గనుంది. చెల్లింపు

Advertiesment
Aadhaar payment app
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (09:58 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర కష్టాలతో పాటు.. కరెన్సీ కష్టాలు ఏర్పడ్డాయి. దీంతో ఆన్‌లైన్ చెల్లింపులు ఊపందుకున్నాయి. అయితే, ఇకపై ఏటీఎం, పేటీఎం చెల్లింపులకు కూడా ప్రాధాన్యత తగ్గనుంది. చెల్లింపుల కోసం ఉపయోగించే ఇతర ప్రైవేట్ యాప్‌‌లకు కూడా కేంద్రం తీసుకొస్తున్న కొత్త యాప్‌తో షాక్‌‌గా మారనుంది. 
 
నగదురహిత లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన 'ఆధార్ పేమెంట్ యాప్' డిసెంబర్ 25వ తేదీ ఆదివారం ప్రారంభించబోతున్నారు. నోట్ల రద్దు తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకోవడం డిజిటల్ చెల్లింపులపై పలు విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ యాప్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్‌ ప్రాజెక్టు 'ఆధార్‌ పేమెంట్‌ యాప్‌'ను ప్రారంభిస్తారు. ఇది గ్రామాల్లోని చిన్నచిన్న చిల్లర వర్తకులకు ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో చాలా తేలికగా డౌన్‌‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 
ఈ యాప్‌ను తొలుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీన్ని బయోమెట్రిక్ రీడర్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. అనంతరం వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్‌పై ఉంచి కస్టమర్ ఆధార్ కార్డ్ నెంబర్‌ను ఎంటర్ చేసి బ్యాంక్ వివరాలను పొందుపరిచిన తర్వాత స్కానింగ్‌ కోరుతుంది. ఆ తర్వాత వినియోగదారుడు తన వేలి ముద్రను బయోమెట్రిక్ రీడర్‌పై ఉంచితే లావాదేవీ పూర్తవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎద్దులకు సోకే వ్యాధితో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నా : ట్రంప్ వర్గ నేత