Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎద్దులకు సోకే వ్యాధితో ఒబామా చనిపోవాలని కోరుకుంటున్నా : ట్రంప్ వర్గ నేత

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే యేడాది చనిపోరాని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన కీలక నేత జోస్యం చెప్పారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సం

Advertiesment
Trump ally Carl Paladino
, ఆదివారం, 25 డిశెంబరు 2016 (09:21 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే యేడాది చనిపోరాని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన కీలక నేత జోస్యం చెప్పారు. డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచార సమయంలో న్యూయార్క్‌కు సంబంధించి కార్ల్‌ పలాడినో అనే ఓ వ్యాపారవేత్త, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు కో-చైర్మన్‌గా పనిచేశారు. ఈయన గతంలో న్యూయార్క్‌ గవర్నర్‌గా కూడా పనిచేశారు. 
 
వచ్చే కొత్త ఏడాదిలో ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. ఎద్దుల మందకు వచ్చే భయంకరమైన వ్యాధి అయిన కౌ డిసీజ్‌ బరాక్ ఒబామాకు వచ్చి ఆయనను పరీక్షలకు తీసుకెళ్లడానికి ముందే చచ్చిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 
 
అంతేకాకుండా, బరాక్ భార్య మిషెల్లీ ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీతో కలిసి ఓ గుహలో జీవించాల్సిందేనంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలపై ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి. సోషల్‌ మీడియాలో తీవ్ర ప్రతిస్పందనలు వచ్చాయి. జాత్యంహకార వ్యాఖ్యలు చేయడంలో ముందునుంచే పలాడినో అతి చేస్తుంటాడని పలువురు మండిపడ్డారు. కాగా, ఇలాంటి వాటిని తాము ఏమాత్రం ప్రోత్సాహించబోమని ట్రంప్‌ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత మరణం ఓ మిస్టరీ.. కోర్టు విచారణతోనే నిజాలు వెల్లడి : శశికళ పుష్ప