Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ నోట్ ఎస్7ఫోన్లలో కొత్త సాఫ్ట్‌వేర్.. 19నుంచి మూగబోతాయా?

బ్యాటరీలు పేలిపోవడంతో శామ్‌సంగ్‌కు భారీ నష్టాలు ఏర్పడ్డాయి. గెలాక్సీ నోట్ 7ఫోన్లలోని బ్యాటరీతో తలెత్తిన లోపం కారణంగా ఆ ఫోన్లను వెనక్కి తిరిగిచ్చేయాలని శామ్‌సంగ్ సంస్థ వినియోగదారులను కోరింది. ఆ ఫోన్లను

Advertiesment
The Samsung Galaxy S7 edge is now receiving the Android security patch for December
, ఆదివారం, 11 డిశెంబరు 2016 (16:42 IST)
బ్యాటరీలు పేలిపోవడంతో శామ్‌సంగ్‌కు భారీ నష్టాలు ఏర్పడ్డాయి. గెలాక్సీ నోట్ 7ఫోన్లలోని బ్యాటరీతో తలెత్తిన లోపం కారణంగా ఆ ఫోన్లను వెనక్కి తిరిగిచ్చేయాలని శామ్‌సంగ్ సంస్థ వినియోగదారులను కోరింది. ఆ ఫోన్లను తిరిగిచ్చిన వారికి మరో మోడల్‌ ఫోన్‌ తీసుకోవడం.. రీఫండ్‌ పొందే అవకాశం కల్పించింది. అయినా ఇప్పటికీ పూర్తిగా రికవరీ కాలేదట.
 
మొత్తం ఫోన్లలో 87శాతం రీకాల్‌ కాగా.. అమెరికాలో 93శాతం అయ్యాయట. అందుకే శామ్‌సంగ్ కొత్త నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను పంపించి తిరిగివ్వని నోట్‌7 ఫోన్లను పూర్తిగా పనిచేయకుండా చేయాలని నిర్ణయించింది. తొలుత అమెరికాలో ఈనెల 19 నుంచి ఫోన్లకు సాఫ్ట్‌వేర్‌ను పంపించనుందట. అయితే అమెరికాలోని ప్రముఖ నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ వెరిజోన్‌ మాత్రం ఆ అప్‌డేట్లను తమ వినియోగదారులకు చేరవేసేందుకు నిరాకరిస్తోంది. 
 
ఇళ్లకు దూరంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్లను పనిచేయకుండా చేస్తే వినియోగదారులు ఇబ్బంది పడతారని అభిప్రాయపడింది. మిగతా సంస్థలు మాత్రం అంగీక రించాయి. న్యూజిలాండ్‌లోనూ ఓ సాఫ్ట్‌వేర్‌ను పంపించి నోట్‌7 ఫోన్లలో వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్‌ పనిచేయకుండా చేసింది సామ్‌సంగ్‌. బ్యాటరీలలో 60 శాతానికంటే ఎక్కువ ఛార్జింగ్‌ కాకుండా నియంత్రించడంతో ఆ ఫోన్లలో బ్యాటరీలు పేలిపోకుండా చేసేందుకు శామ్‌సంగ్ ముందుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో చర్చ్ కూలిన ఘటనలో 160 మంది మృతి.. ఐరన్ రాడ్ల కింద వందలాది మంది?