Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నోటిదూల : సుందర్ పిచాయ్ కన్నెర్ర .. గూగుల్ ఉద్యోగం ఊడింది..

ఓ ఉద్యోగి నోటిదూల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. గూగుల్ కంపెనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమ్మాయిలపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడంతో ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కన్నెర్రజేశాడు. దీంతో ఆ ఉద్యోగి ఉ

నోటిదూల : సుందర్ పిచాయ్ కన్నెర్ర .. గూగుల్ ఉద్యోగం ఊడింది..
, మంగళవారం, 8 ఆగస్టు 2017 (13:53 IST)
ఓ ఉద్యోగి నోటిదూల కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. గూగుల్ కంపెనీకి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమ్మాయిలపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయడంతో ఆ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ కన్నెర్రజేశాడు. దీంతో ఆ ఉద్యోగి ఉద్యోగం వీడింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఇటీవల కంపెనీకి జేమ్స్ దామోర్ అనే ఉద్యోగి 10 పేజీలతో కూడిన ఓ లేఖను రాశాడు. ఇది చిన్నపాటి సునామీనే సృష్టించింది. స్త్రీ పురుష సమానత్వం కోసం కంపెనీ తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. టెక్నికల్ ఉద్యోగాల్లో మహిళలు తక్కువగా ఉండడానికి కారణం లింగ వివక్ష కాదనీ... జీవ వైవిద్యమే కారణమన్నాడు. 
 
ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగాలపై మహిళలు ఆసక్తి చూపడం లేదనీ... అలాంటి ఉద్యోగాల్లో మగాళ్లే సరిగ్గా సరిపోతారని... ఇలా ఇష్టమొచ్చినట్టు చెత్త కారణాలన్నీ అందులో రాశాడు. ఇదికాస్తా బయటికి పొక్కడంతో కంపెనీలో మిగతా ఉద్యోగులు, మహిళా ఉద్యోగుల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. దామోర్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గూగుల్ అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
 
ఈ లేఖపై గూగూల్ సీఈవో సుందర్ పీచాయ్ స్పందించారు. 'ఆ లేఖలోని పలు అంశాలు కంపెనీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయి. విధినిర్వహణ ప్రాంతంలో పరిధి దాటి ప్రమాదకరమైన రీతిలో లింగవివక్ష కలిగించేలా ఉన్నాయి' అంటూ పేర్కొంటూ ఉద్యోగం నుంచి తొలగించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధానికి సహకరించిందనీ... మహిళను నగ్నంగా చేసి.. భర్త ఎదుటే రేప్ చేశారు