Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్కారీ బడి స్టూడెంట్‌కు గూగుల్ జాబ్... ఊహించని ప్యాకేజీ...

ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. అదీకూడా నెలకు రూ.4 లక్షల స్టైఫండ్‌ తీసుకుంటాడు. ఒక యేడాది తర్వాత రూ.12 లక్షల వేతనం అందుకుంటాడు. ఆ కుర్రోడి పేరు హ

సర్కారీ బడి స్టూడెంట్‌కు గూగుల్ జాబ్... ఊహించని ప్యాకేజీ...
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (08:41 IST)
ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్‌లో జాబ్ కొట్టేశాడు. అదీకూడా నెలకు రూ.4 లక్షల స్టైఫండ్‌ తీసుకుంటాడు. ఒక యేడాది తర్వాత రూ.12 లక్షల వేతనం అందుకుంటాడు. ఆ కుర్రోడి పేరు హర్షిత్ శర్మ. చండీగఢ్‌కు చెందిన ఈ కుర్రోడు 12వ తరగతి చదువుతున్నాడు. వయసు 16 యేళ్లు. 
 
చండీగఢ్‌లోని ‘గవర్నమెంట్‌ మోడల్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌’ విద్యాభ్యాసం చేసే హర్షిత్‌కు చిన్నప్పటి నుంచీ గ్రాఫిక్‌ డిజైనింగ్‌ అంటే చాలా ఇష్టం. పదో యేట నుంచే మేనమామ రోహిత్‌ శర్మ వద్ద గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందుతూ వచ్చాడు. ఆ తర్వాత అతనికి అదే లోకమైపోయింది. ఎలాగైనా గూగుల్‌లో జాబ్‌ సాధించాలనే లక్ష్యంతో కృషి చేశాడు. 
 
తన పాఠశాల విద్యాభ్యాసం కొనసాగిస్తూనే బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమాల పోస్టర్లు డిజైన్‌ చేస్తూ నెలకు రూ.40-50 వేలు సంపాదించేవాడు. ప్రధాని కార్యాలయం నిర్వహించిన ‘డిజిటల్‌ ఇండియా’ కార్యక్రమంలో తన సత్తా చాటి రూ.7000 రివార్డుగా పొందాడు. గత యేడాది డిసెంబరులో గూగుల్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తాను ఇప్పటికే డిజైన్‌ చేసిన పోస్టర్లను గూగుల్‌కు పంపాడు.
 
వీటిని పరిశీలించిన గూగుల్ యాజమాన్యం... ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ లెటర్‌ను పంపించింది. శిక్షణ కోసం ఈనెల 7వ తేదీ కాలిఫోర్నియాకు వెళ్లబోతున్నాడు. అక్కడ అతడికి యేడాదిపాటు శిక్షణనిస్తారు. ఆ సమయంలో స్టైపెండ్‌గా నెలకు రూ.4 లక్షలు ఇస్తారు. ఏడాది తర్వాత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ ఉద్యోగం రావడంతో తన కల నిజమైందని హర్షిత్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలోనే భారీ ఉల్కాపాతం.. ఆగస్టు 12న జీవితంలో అరుదైన దృశ్యం మిస్ కావద్దు