రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్ రావాలి... గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
దేశీయ అవసరాలకోసం రూ.2 వేల ధర కలిగిన (30 డాలర్ల లోపు) స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తద్వారా ఇంటర్నెట్ వినిమయం పెరుగడంతోపాటు డిజిటల్ పరిధిలోకి మరింత మ
దేశీయ అవసరాలకోసం రూ.2 వేల ధర కలిగిన (30 డాలర్ల లోపు) స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. తద్వారా ఇంటర్నెట్ వినిమయం పెరుగడంతోపాటు డిజిటల్ పరిధిలోకి మరింత మంది చేరేందుకు అవకాశం ఉంటుందన్నారు.
తాను 23 సంవత్సరాల క్రితం చదువుకున్న ఐఐటీ-ఖరగ్‌పూర్‌ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. ప్రాంతీయ భాషల్లో పనిచేసే స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశవ్యాప్తంగా అనుసంధానం మెరుగుపడనున్నదని చెప్పారు. దీనివల్ల డిజిటల్ ఎకానమిలో భారత్ గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించనున్నదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2014లో గూగుల్.. ఆండ్రాయిడ్ వన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో స్మార్ట్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టింది. మార్కెట్లోకి విడుదల చేసే సమయంలో ఫోన్ ధర రూ.6,399గా ఉంది. దీనికంటే మెరుగైన అత్యాధునిక ఫీచర్స్, తక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.