Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ విద్యార్థులకు షాకిచ్చిన అమెరికా విద్యాశాఖ.. వారిభవిష్యత్ ఏంటి?

అమెరికా విద్యాశాఖ భారతీయ విద్యార్థులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఫలితంగా అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరిలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Advertiesment
america
, శుక్రవారం, 6 జనవరి 2017 (05:33 IST)
అమెరికా విద్యాశాఖ భారతీయ విద్యార్థులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. ఫలితంగా అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వీరిలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, సమస్య పరిష్కారం కోసం ఆంధ్రపదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, స్థానిక తెలుగు సంఘం తానా కార్యవర్గ ప్రతినిధులు న్యాయ నిపుణులను, విద్యాసంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. అమెరికాలోని స్వతంత్ర కళాశాలలు, పాఠశాలలకు జాతీయస్థాయి సంస్థ అయిన ‘అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ (ఏసీఐసీఎస్)’ గుర్తింపు ఇస్తుంటుంది. గత నెలలో అమెరికా విద్యా శాఖ ఏసీఐసీఎస్ గుర్తింపునే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
ఇది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) కింద ఏసీఐసీఎస్ గుర్తింపునిచ్చిన 130 కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న సుమారు 16 వేల మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ స్వయంగా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువమంది భారత సంతతి విద్యార్థులు కాగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నారు. 
 
ఏసీఐసీఎస్‌ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలకు అమెరికా విద్యా శాఖ 18 నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే ఈలోగా కొత్తగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. చాలా విద్యా సంస్థలు అక్రిడిటింగ్ కమిషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ (ఏసీసీఎస్‌సీ)ను ఆశ్రయిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం విధించిన కొత్త షరతులకు ఆయా విద్యాసంస్థలు అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి అనేక కాలేజీలు సమ్మతించక పోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ భార్య ఇష్టంతో చేసే సెక్స్ నేరమా? కాదా? సుప్రీం ఏమంటోంది?