భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత సంస్థ అయిన సారెగామా, ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ఫేస్‌బుక్‌తో జతకట్టింది. ఫేస్‌బుక్ సంస్థకు చెందిన సోషల్ మీడియాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు, అలాగే ఇతర సామాజిక అంశాల కోసం సారెగామా సంస్థకు సంబంధించిన సంగీతాన్ని షేర్ చేసుకునేందుకు బుధవారం ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌లు ఇకపై తమ వీడియోలు, స్టోరీలు, క్రియేటివ్ కంటెంట్ కోసం సారెగామాకు చెందిన మ్యూజిక్‌ను వినియోగించుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఒప్పందం వల్ల ఫేస్‌బుక్ యూజర్‌లు ఇకపై తమ ప్రొఫైల్‌కు తాము కోరుకున్న పాటలను యాడ్ చేసుకోవచ్చు.
గతంలో గ్రామ్‌ఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాగా పిలిచే సారెగామా ఇండియా కంపెనీ, భారతదేశంలో అతిపెద్ద మ్యూజిక్ ఆర్కైవ్‌లను కలిగి ఉంది. ఒక రకంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్ సంస్థగా పిలవచ్చు. ఈ సంస్థ 25కు పైగా భాషల్లోని సినిమాలు, భక్తి సంగీతం, గజల్స్, ఇండిపాప్ వంటి వివిధ స్టైల్స్‌లో లక్షకుపైగా పాటలను కలిగి ఉంది.
ఈ ఒప్పందం వల్ల లక్షల సంఖ్యలో ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులకు తమ క్యాటలాగ్ నుంచి సంగీతాన్ని, స్టోరీలను మరియు వీడియోలను తమ ప్రొఫైల్‌కు యాడ్ చేసుకునే అవకాశం కలుగుతుందని సారెగామా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ మెహ్రా అన్నారు. సారెగామాతో భాగస్వామ్యం కావడం ఎంతో గర్వంగా ఉందని ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్, పార్ట్‌నర్‌షిప్ హెడ్ మనీష్ చోప్రా తెలిపారు.