భారతదేసపు అతి పెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Samsung తమ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ డివైజ్, పోర్టబుల్ సాలిడ్-స్టేట్ డ్రైవ్ (ఎస్ ఎస్ డీ) టీ9ను ఈ రోజు పరిచయం చేసింది. ఇది స్టోరేజ్ ఆప్షన్స్ 4TB వరకు అందిస్తుంది, వేగవంతమైన డేటా ట్రాన్స్ ఫర్ వేగాన్ని మరియు కావలసినంత స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది, యూజర్స్ కు కావలసిన నమ్మకం మరియు సౌకర్యాన్ని నిర్థారిస్తుంది.
T9 నాజూకైన డిజైన్‌తో పాటు, మెరుపు వేగంతో USB 3.2 Gen 2x2 ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. 2,000 MB/s రీడ్/రైట్ వేగాల వరకు పెరిగిన ఉత్పాదకతను అందిస్తుంది. ఇది T9ని కంటెంట్ తయారీదారుల కోసం విచారరహితమైన ఎంపికను చేసింది, సృజనాత్మకత కోసం సమయం కేటాయిస్తుంది.
“హై-రిజల్యూషన్ కంటెంట్ పరిస్థితిలో, T9 అనేది డేటా నిర్వహణ, పెద్ద ఫైల్స్ బదిలీ చేయడం, మన్నిక మరియు పనితీరు సమస్యలు వంటి సవాళ్లు కోసం పరిష్కారాలు కోరుకునే ప్రొఫెషన్స్ కోసం ఒక జవాబు. శామ్ సంగ్ పోర్టబుల్ SSD T9 ఆడేటా సవాళ్లను పరిష్కరించడం ద్వారా మరియు తమ సృజనాత్మక అభిలాషలను పెంపొందించే మెమోరీ పరిష్కారాలు కేటాయించడం ద్వారా ఆధునిక కంటెంట్ సృష్టికర్తలను శక్తివంతం చేస్తుందని,” పునీత్ సేథీ, వైస్ ప్రెసిడెంట్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్, శామ్‌సంగ్ ఇండియా అన్నారు.
గొప్ప పనితీరు- భారీ స్టోరేజ్ సామర్థ్యం
గరిష్ట వరుస క్రమం రీడ్/రైట్ స్పీడ్స్ తో USB 3.2 Gen 2x2 ఇంటర్ ఫేస్ పైన 2,000 MB/s కు చేరుకుంటున్న, T9 ఇంతకుముందున్న T7 ని దాదాపు రెట్టింపు వేగంతో నిర్మూలించింది. అనగా మీరు 4GB ఫుల్ HD వీడియోని సుమారు రెండు సెకండ్లలో పంపించవచ్చు.
మూడు వేర్వేరు సామర్థ్యాలలో - 1TB, 2TB మరియు 4TB- లభిస్తున్న T9 సృష్టికర్తల విభిన్నమైన అవసరాలకు సహాయపడుతుంది. ఇది వేగవంతమైన మరియు తరచూ బదిలీలు కోసం రూపొందించబడింది కాగా పెద్ద డేటా పరిమాణాలు కోసం గణనీయమైన స్టోరేజ్ స్థలాన్ని కేటాయిస్తుంది. T9 యొక్క నాజూకైన మరియు క్రెడిట్ కార్డ్ సైజ్ డిజైన్ యూజర్స్ ఎక్కడకు వెళ్లినా తమ సృజనాత్మక ప్రేరణను తీసుకునేలా అవకాశం ఇస్తుంది.