Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంసంగ్ నుంచి రూ.9,999లకే మరో కొత్త స్మార్ట్ ఫోన్..

శాంసంగ్ నుంచి రూ.9,999లకే మరో కొత్త స్మార్ట్ ఫోన్..
, గురువారం, 16 జులై 2020 (19:33 IST)
Samsung Galaxy M01s
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ మరో స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎమ్‌01ఎస్ పేరుతో ఈ 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.9,999 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. 
 
ఇందులో 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌లను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఏర్పాటు చేశారు. 
 
ఇంకా శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ ఫీచర్ల సంగతికి వస్తే..?
* 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టం
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
* 6.2 ఇంచుల హెచ్‌డీ ప్లస్
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్
* 13+2 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్ కీలక నిర్ణయం.. జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు