ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం 5జీ సేవలపై దృష్టి పెట్టింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కాల్స్, ఎస్ఎంఎస్‌లు చేసుకునేందుకు నెట్‌వర్క్ పనిచేయట్లేదు. అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లోనూ సమస్యలు ఉన్నట్లు యూజర్లు వాపోతున్నారు.
దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు జియో నెట్ వర్క్‌లో సమస్యలు ఎదురైనట్టు వార్తలు వస్తున్నాయి. దేశంలో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్ పట్టణాల నుంచి యూజర్లు ఈ సమస్యలను ఎత్తి చూపుతున్నారు.
ముఖ్యంగా వోల్టే సింబల్ ఉదయం నుంచి కనిపించట్లేదు. దీంతో కాల్స్ చేసుకునే వీలు లేకపోయింది. సాధారణ కాల్స్‌తో పాటు బ్రౌజింగ్‌లోనూ సమస్య తప్పలేదు. దేశంలో 37 శాతం మంది యూజర్లు తమకు సిగ్నల్ రావట్లేదని.. ఫిర్యాదు చేశారు. 26 శాతం మంది యూజర్లు మొబైల్ ఇంటర్నెట్‌లోనూ సమస్యలు ఉన్నట్టు టాక్.