Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా కల సాకారం కాకుండా భారమైన హృదయంతో.. విరాట్ కోహ్లీ ట్వీట్

virat kohli
, శుక్రవారం, 11 నవంబరు 2022 (13:42 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్‌లో ఊదేశారు. ఈ ఓటమిపై భారత జట్టుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమితో భారత్ స్వదేశానికి పయనమైంది. దీనిపై విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.
webdunia
 
"మా కల సాధించకుండా తీవ్ర నిరాశతో నిండిన హృదయంతో ఆస్ట్రేలియా తీరాలను వదలివెళుతున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిత్యం వహించడం ఎల్లవేళలా గర్వంగా భావిస్తున్నా" అంటూ పేర్కొన్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ చెత్త ఆటతీరును వెన్నుకేసుకొచ్చిన సచిన్ : నాణేనికి రెండు ముఖాలు