Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో చైనా బాంబ్ : రెడ్‌మీ నోట్-4 బ్లాస్ట్... తొడకు గాయాలు.. ఎక్కడ?

ఇటీవలి కాలంలో వివిధ కంపెనీలు తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్నటువంటి వార్తలు వరుసగా వింటున్నాం. వింటూనే ఉన్నాం. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫలితంగా కాలి తొడభాగంలో గాయమైంది.

Advertiesment
వామ్మో చైనా బాంబ్ : రెడ్‌మీ నోట్-4 బ్లాస్ట్... తొడకు గాయాలు.. ఎక్కడ?
, సోమవారం, 14 ఆగస్టు 2017 (12:48 IST)
ఇటీవలి కాలంలో వివిధ కంపెనీలు తయారు చేసే స్మార్ట్‌ఫోన్లు పేలిపోతున్నటువంటి వార్తలు వరుసగా వింటున్నాం. వింటూనే ఉన్నాం. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ పేలిపోయింది. ఫలితంగా కాలి తొడభాగంలో గాయమైంది. ఇపుడు పేలిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్. చైనా మొబైల్ కంపెనీ జియోమీ తయారు చేసిన ఈ ఫోన్‌కు ఇపుడు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా.. రెడ్‌మీ 4, రెడ్‌మీ 4ఏ ఫోన్ల కోసం వినియోగదారులు పోటీపడుతున్నారు.
 
అయితే, ఇపుడు రెడ్‌మీ నోట్-4 పేలింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన సూర్యకుమార్ అనే యువకుడు 20 రోజుల క్రితం కొనుగోలు చేసిన రెడ్‌మీ నోట్ 4 ఫ్యాటు జేబులో పెట్టుకుని వెళుతుండగా ఉన్నట్టుండి అకస్మికంగా పేలిపోయింది. 
 
ఫోన్‌కు ఉన్న సెల్‌పౌచ్ పూర్తిగా కాలిపోయి తొడకు అతుక్కునిపోయింది. దీంతో తొడ భాగంలో గాయమైంది. ఫోన్ కూడా కాలిపోయింది. అయితే, ఈ ఫోన్ చిన్నపాటి శబ్దంతో పేలడంతో ఆ యువకుడి ప్రాణాపాయం తప్పింది. కాగా, గత నెలలో బెంగుళూరులో కూడా రెడ్‌మీ నోట్ 4 పేలిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిలపై కామెంట్స్ : రోజా.. నోరు తగ్గించుకుంటే మంచిది... క్లాస్ పీకిన భర్త