Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంగక్కర కొట్టిన సిక్స్.. స్మార్ట్ ఫోన్‌ను పగులకొట్టింది.. వీడియో చూడండి..

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే గుడ్ బై చెప్పేసిన సంగక్కర.. ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశీ ట్వంటీ-20లో పాల్గొంటున్నాడు.

Advertiesment
సంగక్కర కొట్టిన సిక్స్.. స్మార్ట్ ఫోన్‌ను పగులకొట్టింది.. వీడియో చూడండి..
, శుక్రవారం, 14 జులై 2017 (18:05 IST)
శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రెండేళ్ల క్రితమే గుడ్ బై చెప్పేసిన సంగక్కర.. ప్రస్తుతం ఇంగ్లండ్ స్వదేశీ ట్వంటీ-20లో పాల్గొంటున్నాడు. తాజాగా సర్రే-మిడిల్ సిక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంగక్కర సిక్స్‌తో విశ్వరూపం చూపాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సులతో ఏకంగా 70 పరుగులు సాధించి.. తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. 
 
సంగక్కర కొట్టిన ఓ సిక్స్... అభిమానులు కూర్చునే ప్రాంతానికి దూసుకెళ్లింది. స్టీవెన్ ఫిన్ బౌలింగ్‌లో సంగక్కర భారీ షాట్ కొట్ట‌గా ఆ బాల్‌ను అందుకోవాల‌ని చూసిన ఓ అభిమాని షాక్ అయ్యాడు. బాల్ పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆ ఫ్యాన్.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం మరిచిపోయాడు. దీంతో అత‌డి చేతిలోని స్మార్ట్‌ఫోన్‌కి బాల్ తగిలి పగిలిపోయింది. త‌న ఫోన్‌ను కెమెరాకు చూపిస్తూ అభిమాని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఆ వీడియోను మీరు చూడండి.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లో ఇక చెన్నై సూపర్ కింగ్స్... రెండేళ్ళ నిషేధం హుష్ కాకి.. ధోనీ సారథ్యంలో?