Redmi 12 సిరీస్‌ను రెడ్‌మీ భారతదేశంలో ప్రారంభించింది. ఇది 4G, 5G వేరియంట్‌లను కలిగి ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకర్షించింది. తాజాగా Redmi 12 సేల్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, వేరియంట్ల ఫీచర్లు, ధర వంటి వివరాలను తెలుసుకుందాం.
ఈ రెండు మొబైల్స్ జేడ్ బ్లాక్, పాస్టెల్ బ్లూ, మూన్‌స్టోన్ సిల్వర్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు కూడా ఒకేలా ఉన్నాయి.
Redmi 12 5Gలో Qualcomm Snapdragon 4 Gen 2 SoC చిప్‌సెట్ ఉండగా, 4G మోడల్‌లో MediaTek Helio G88 12nm SoC ప్రాసెసర్ ఉంది. రెండూ 6.79-అంగుళాల పూర్తి HD ప్లస్ 90Hz LCD డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి.
రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 50MP డ్యూయల్ రియర్ కెమెరా కూడా రాబోతోంది. ముందువైపు 8 ఎంపీ కెమెరా ఉంది. ఇందులో 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది.
ఈ Redmi 12 Redmi 11కి సక్సెసర్‌గా వస్తోంది.
Redmi 12 4G (4GB RAM – 128GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 8,999.
6GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499.
5G మోడల్ 4GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999.
6GB RAM-128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499.
8GB RAM-256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499.