మొబైల్స్ తయారీదారు ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి తన రియల్‌మి 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఫోన్‌కు సంబంధించి రియల్‌మి బ్లైండ్ ఆర్డర్ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ శుక్రవారం అర్థరాత్రి 12 నుండి రేపు అర్థరాత్రి 12 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా వినియోగదారులకు ఆర్-పాస్ పేరిట ఓ యూనిక్ కోడ్‌ను అందిస్తారు.
దీనిని ఉపయోగించి కస్టమర్‌లు ఈ నెల 29వ తేదీన రియల్‌మి 3 ప్రో ఫోన్‌ను పొందవచ్చు. ఇక ఈ ఆర్-పాస్‌ను కలిగి ఉన్నవారు రియల్‌మి 3 ప్రోకు చెందిన ఏ కలర్ వేరియెంట్‌ను అయినా కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు. కాగా ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యేకంగా విక్రయించనున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాలను ఇంకా వెల్లడించలేదు.