Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

జియో బంపర్ ఆఫర్.. పేటీఎం, ఫోన్ పేలతో రీఛార్జ్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్

Advertiesment
Prepaid Mobile Recharge
, బుధవారం, 4 ఆగస్టు 2021 (14:03 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. పేటీఎం, ఫోన్‌ పే, ఇతర పేమెంట్స్‌ యాప్స్‌ ద్వారా జియో రీఛార్జ్‌ చేస్తే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ పొందవచ్చు. 2021 ఆగస్ట్‌ 1 నుంచి ఆగస్ట్‌ 31 వరకు క్యాష్‌బ్యాక్, రివార్డ్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది జియో. ఈ ఆఫర్‌ ప్రస్తుత జియో వినియోగదారులకు మాత్రమే కాదు, కొత్త యూజర్లు కూడా పొందొచ్చు. ఆఫర్ల భాగంగా క్యాష్‌బ్యాక్‌తో పాటు మరెన్నో ఆఫర్స్‌ ఉన్నాయి.
 
కొత్త జియో వినియోగదారులు పేటీఎం ద్వారా రీఛార్జ్‌ చేస్తే రూ.75 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. రూ.250 కంటే ఎక్కువ క్రెడిట్‌ లభిస్తుంది. ఇక ప్రస్తుత జియో యూజర్లు పేటీఎం ద్వారా రీఛార్జ్‌ చేస్తే 1500 పేటీఎం ఫస్ట్‌ పాయింట్స్‌ వస్తాయి. కానీ, ఈ ఆఫర్‌ కేవలం మొదటి నుంచి ఆరో రీఛార్జ్‌ వరకే ఇది వర్తిస్తుంది.
 
ఫోన్‌ పే ద్వారా కొత్త జియో రీఛార్జ్‌ చేస్తే రూ.600 వరకు రివార్డ్స్‌ లభిస్తాయి. పస్తుత జియో యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.400 రివార్డ్స్‌ లభిస్తాయి.
 
అమెజాన్‌ ద్వారా కొత్త జియో యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.50 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. పాత యూజర్లు ఈ ఆఫర్‌తో రీఛార్జీ చేస్తే.. రూ.125 వరకు రివార్డ్స్‌ పొందవచ్చు.
 
మొబీక్విక్‌ ద్వారా జియో కొత్త యూజర్‌ రీఛార్జ్‌ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఇక ప్రస్తుత జియో యూజర్‌ రీఛార్జ్‌ చేస్తే రూ.100 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. కొత్త యూజర్‌ రూ.399 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.
 
ఫ్రీఛార్జ్‌ ద్వారా పాత యూజర్లు రీఛార్జ్‌ చేస్తే రూ.1000 వరకు రివార్డ్స్‌ పొందొచ్చు. ప్రతీ రీఛార్జ్‌పై ఈ ఆఫర్‌ ఉంది. కొత్త యూజర్‌ రూ.199 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే రూ.40 క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటక: 29 మంది బిజెపి శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం