Publish Date: Sat, 20 Jun 2026 (10:01 IST)
Updated Date: Sat, 20 Jun 2026 (10:08 IST)
సోషల్ మీడియాలో ట్రెండ్ కోసం ప్రాంక్‌ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ ట్రెండ్ నడుస్తోంది. ఆ ప్రాంక్ బారిన పడిన జనం గాయాలపాలవుతున్నారు. ఆ ప్రాంక్ వీడియోలో ఏముందంటే.. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హారతి పల్లెంతో వీధుల్లో తిరుగుతున్నారు. వీధుల్లో వెళ్లే వారిని హారతి తీసుకోమని అడుగుతున్నారు.
హారతి తీసుకునే ముందు చేతులు కడుక్కోమని వారి చేతులపై ఓ లిక్విడ్ పోస్తున్నారు. వాళ్లు ఆ లిక్విడ్‌తో చేతులు కడుక్కుని హారతి తీసుకోగానే.. భగ్గున చేతులకు మంటలు అంటుకుంటున్నాయి.
అది కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంక్ కారణంగా చాలా మంది చేతులు కాలిపోయాయి. ఈ వీడియో చూసిన వారంతా మండిపడుతున్నారు. హారతి ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.