రిలయన్స్ జియోకు మరో తలనొప్పి : దేశభక్తిలేని షారూఖ్ అంబాసిడరా? సిమ్ కార్డులు తిరిగిచ్చేస్తాం
ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు మరో తలనొప్పి వచ్చింది. ఇది బ్రాండ్ అంబాసిడర్ నియామకంతో వచ్చింది. ప్రస్తుతం జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ‘బాద్షా’ షారూఖ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఈయనపై
ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు మరో తలనొప్పి వచ్చింది. ఇది బ్రాండ్ అంబాసిడర్ నియామకంతో వచ్చింది. ప్రస్తుతం జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ ‘బాద్షా’ షారూఖ్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఈయనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
షారూఖ్‌లో దేశభక్తి ఏమాత్రం లేదని, అటువంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన వంచకుడని, జాతి వ్యతిరేకి అని ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారు. షారూఖ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా తప్పించి ఆ స్థానంలో రియో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వారికి అప్పగించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జియో సిమ్‌లు తిరిగి ఇచ్చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
‘ఉచిత’ ఆఫర్‌తో టెలికం గుండెల్లో వణుకు పుట్టించిన రిలయన్స్ ఇప్పుడు నెటిజన్ల విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లక్షలాది మంది ఫాలోయర్లు ఉన్న షారూఖ్‌కు కూడా ఇది షాకింగే. అయితే నెటిజన్ల విమర్శలు, పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న ఆగ్రహంపై అటు రిలయన్స్ నుంచి కానీ, ఇటు షారూఖ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.