Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌కు షాకిచ్చిన మోడీ.. బలూచిస్థాన్‌లో ప్రారంభమైన ఆకాశవాణి ప్రసారాలు

పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారు. బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించారు. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇప్పటికే.. బలూచిస్థాన్‌ విషయంలో మోడీ తన వైఖరిని

Advertiesment
Balochistan
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:40 IST)
పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షాకిచ్చారు. బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించారు. దీన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ఇప్పటికే.. బలూచిస్థాన్‌ విషయంలో మోడీ తన వైఖరిని తేటతెల్లం చేసిన విషయం తెల్సిందే. ఇపుడు మరోసారి పాక్‌ను కలవరపాటుకు గురిచేసింది. 
 
బలూచిస్థాన్‌లో శుక్రవారం నుంచి ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్ వ్యవహారంలో తలదూర్చిన భారత్‌పై ఇప్పటికే మండిపడుతున్న పాక్‌ తాజా ఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బలూచ్‌లో ఆకాశవాణి ప్రసారాలపై ప్రధాని మోడీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
 
భారత్ ప్రకటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ తమ దేశంలో డీటీహెచ్ ద్వారా ప్రసారమవుతున్న భారత్ టెలివిజన్ చానళ్లను నిషేధించింది. అయినా ఏమాత్రం తగ్గని భారత్ అనుకున్నట్టుగానే బలూచిస్థాన్‌లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించింది. ఈ మేరకు బలూచ్ ప్రజల కోసం బలూచ్ భాషల్ మల్టీమీడియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీంతో ఇక నుంచి బలోచ్ ప్రజలు ఆకాశవాణి కార్యక్రమాలను, వార్తలను నేరుగా వినొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేయ్ ఆ బండోడు వద్దు... ఎంతమంది రేప్ చేస్తార్రా? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బాధితురాలు(True Story)