Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేయ్ ఆ బండోడు వద్దు... ఎంతమంది రేప్ చేస్తార్రా? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బాధితురాలు(True Story)

వాళ్లు నరరూప రాక్షసులు. ఒక్కసారి వారి చేతికి చిక్కితే ఇక అంతేసంగతులు. ప్రాణాలతో తిరిగి లోకాన్ని చూడటం కల్ల. ఇంతకీ ఎవరు వారు అంటే... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. ఐసిస్. వారి చేతికి చిక్కి ఎన్నో చిత్ర హ

రేయ్ ఆ బండోడు వద్దు... ఎంతమంది రేప్ చేస్తార్రా? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల బాధితురాలు(True Story)
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:38 IST)
వాళ్లు నరరూప రాక్షసులు. ఒక్కసారి వారి చేతికి చిక్కితే ఇక అంతేసంగతులు. ప్రాణాలతో తిరిగి లోకాన్ని చూడటం కల్ల. ఇంతకీ ఎవరు వారు అంటే... ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు. ఐసిస్. వారి చేతికి చిక్కి ఎన్నో చిత్ర హింసలకు గురై తప్పించుకున్న బాధితురాలు 23 ఏళ్ల నదియా మురాద్. యాజిది మహిళ అయిన ఆమెను ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ట్రాఫికింగ్ చేశారు. 2014లో జరిగిందా సంఘటన. ఆ రోజు అసలేం జరిగిందో ఆమె ఐక్యరాజ్యసమిత సభ్యుల ముందు ఏకరవు పెట్టింది.
 
"నన్ను ట్రాఫికింగ్ చేశాక ఒకడు నాపై అత్యాచారం చేయబోయాడు. వాడిని ఎదిరించాను. కొట్లాడాను. నా శక్తికొద్దీ తిరగబడ్డాను. ఆ తర్వాత నాలో శక్తి సన్నగిల్లింది. ఆ తర్వాత ఇద్దరు... ముగ్గురు, నా ఓపిక నశించింది. వారు నాపై అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు నేను మరో ప్రపంచం లోకి వెళ్లిపోయేదాన్ని. నాతోపాటు ఎంతోమంది మహిళలపై ఇలాగే సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఆ మహిళల్లో నా సోదరీమణులు కూడా ఉన్నారు.
 
2014 ఆగస్టు 5న ఐసిస్ ఉగ్రవాదులు మేము నివాసముంటున్న గ్రామానికి వచ్చారు. ఇస్లాంలోకి మారండి లేదా చావండి అన్నారు. ఐతే ఎవరూ మతం మారేందుకు అంగీకరించలేదు. ఉగ్రవాదులు నా సోదరులతో సహా పురుషులను బయటకు లాక్కెళ్లారు. కాళ్లతో తంతూ నా కళ్ల ముందే నా సోదరులను కాల్చి చంపారు. 
 
ఆ తర్వాత లోపలున్న తమను బయటకు ఈడ్చుకొచ్చి బందీలుగా చేశారు. నాతో సహా 150 మంది అమ్మాయిలను మోసుల్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ నాతోబాటు ఉన్న మహిళలందరినీ చిన్నచిన్న గదుల్లో బంధించారు. కొన్నిరోజుల్లోనే నాతోపాటు ఉంటున్న అమ్మాయిల్లో చాలామంది వాంతులు చేసుకున్నారు. అత్యాచారాల పరంపరం సాగింది. నా వద్దకు లావుగా ఉన్న ఓ వ్యక్తి వచ్చాడు. రేప్ చేయబోయాడు. 
 
నేను వాడిని తిట్టాను. ఈ బండోడితో నేను వెళ్లను. నీతో నేను రాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని బతిమాలాను. ఐతే వాడు నా మాటలను పట్టించుకోలేదు. పశువులా మీదకు రాబోయాడు. ఇంతలో సన్నగా ఉన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతడిని బ్రతిమాలాడాను. ఆ బండవాడిని తీసుకెళ్లు అన్నాను. ఐతే వాడు నా మరదలు వరసయ్యే అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించనలవికావడంలేదు. 
webdunia
 
ఆ తర్వాత నేనున్న గదిలోకి చాలామంది ఐసిస్ పురుషులు ప్రవేశించారు. ఆ తర్వాత ఆ గదికి లోపల తాళం పెట్టేశారు. వరుసగా అందరూ నాపై సామూహిక అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. అలా పగలు రాత్రి అనే తేడా లేకుండా రేప్ చేసేవారు. మమ్మల్ని జంతువుల కంటే హీనంగా చూశారు. అత్యాచారం చేస్తున్న సమయంలో అంగీకరించకపోతే క్రూరంగా గొడ్డును బాదినట్లు బాదేవారు.
 
ఎలాగైనా ఈ నరకం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఐతే తప్పించుకునే క్రమంలో వారికి పట్టుబడితే ఇక మరణం తప్పదని తెలుసు. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. అమెరికా సేనలు దాడులు జరుపుతున్న సమయంలో అవకాశం చూసుకుని తప్పించుకుని బయటపడ్డాను" అని యూఎస్ అంబాసిడర్ సమంత ముందు చెపుతూ బోరుమని కన్నీళ్లు పెట్టుకుంది నదియా. 
 
ఈమెను నోబుల్ శాంతి బహుమతి నామినీగా ఎంపిక చేశారు. అంతేకాదు ధైర్యసాహసాలతో ఐసిస్ చెర నుంచి తప్పించుకుని బాధితుల కోసం పోరాడేందుకు సిద్ధమైన ఆమెను యూఎన్ అంబాసిడర్‌గా ఎంపిక చేయనున్నారు. ఎంతోమంది అమ్మాయిల ట్రాఫికింగ్ పాల్పడుతున్న ఐసిస్ దుశ్చర్యను ఎదుర్కొనేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని చెపుతోంది నదియా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెంచకుండా పంచితే పంచె మిగులుతుంది: వెంకయ్య నాయుడు సెటైర్లు