Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు.. ఆరోగ్య బీమా కూడా...

పతంజలి సంస్థ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన యోగా గురువు బాబా రాందేవ్ తాజాగా సిమ్ కార్డులను కూడా ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎ

Advertiesment
మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు.. ఆరోగ్య బీమా కూడా...
, సోమవారం, 28 మే 2018 (17:22 IST)
పతంజలి సంస్థ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన యోగా గురువు బాబా రాందేవ్ తాజాగా సిమ్ కార్డులను కూడా ప్రవేశపెట్టారు. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్)తో ఒప్పందం చేసుకున్నారు. ఈ రెండు సంస్థలు కలిసి స్వదేశీ-సమ్‌రాధి సిమ్‌కార్డులను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
 
పతంజలి సంస్థ అందించే సిమ్‌కార్డుతో కేవలం రూ.144తో రీఛార్జి చేసుకుంటే దేశవ్యాప్తంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని, 2జీబీ డేటా ప్యాక్‌తో పాటు 100ఎస్సెమ్మెస్‌లు పంపుకునే వీలుందని పేర్కొంది. ప్రారంభంలో పతంజలి సంస్థకు చెందిన ఉద్యోగులు, అధికారులు మాత్రమే సిమ్‌ కార్డు ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఉపయోగించి వినియోగదారులు పతంజలి ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ కూడా పొందవచ్చని వివరించింది.
 
ఇది మాత్రమే కాదు రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమాను కూడా ప్రజలకు అందిస్తామని చెప్పింది. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 5 లక్షల కౌంటర్లు ఉన్నాయని.. వాటి నుంచి ప్రజలు త్వరలో పతంజలి స్వదేశీ-సమ్‌రాధి కార్డును పొందవచ్చని యోగా గురువు, పతంజలి ఆయుర్వేద్ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...