Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృద్ధి దిశగా దూసుకుపోయేందుకు 2022లో 500 మంది ఐటీ ప్రతిభావంతులను జోడించుకోనున్న ఓటీఎస్‌ఐ

వృద్ధి దిశగా దూసుకుపోయేందుకు 2022లో 500 మంది ఐటీ ప్రతిభావంతులను జోడించుకోనున్న ఓటీఎస్‌ఐ
, బుధవారం, 24 ఆగస్టు 2022 (23:02 IST)
ఐటీ సేవలు, కన్సల్టింగ్‌ లో అంతర్జాతీయంగా సుప్రసిద్ధ సంస్ధ ఆబ్జెక్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఓటీఎస్‌ఐ) తమ తరువాత దశ వృద్ధి దిశగా పయణించేందుకు అత్యున్నత ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది. ఈ కంపెనీ  ఇప్పుడు బీఎఫ్‌ఎస్‌ఐ, టెలికామ్‌, హెల్త్‌కేర్‌, లైఫ్‌సైన్సెస్‌, రిటైల్‌, కస్టమర్‌ సేవలు, ఎనర్జీ, యుటిలిటీస్‌, రవాణా, లాజిస్టిక్స్‌, ప్రభుత్వ, పీఎస్‌యు, హైటెక్‌  రంగాలలో డిజిటల్‌ స్వీకరణ పెరగడం చూసింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో తాజాగా మరో 500 మంది ఐటీ ప్రతిభావంతులను నియమించుకోవడానికి ప్రణాళిక చేసింది.

 
‘‘నాణ్యమైన సేవలనందించేందుకు సమపాళ్లలో టెక్నికల్‌, ప్రవర్తనా సామర్ధ్యాలు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నేపథ్యంలోనే మేము క్యాంపస్‌లతో పాటుగా ఆఫ్‌ క్యాంపస్‌ల ద్వారా ప్రతిభావంతులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. దీనితో పాటుగా విస్తృత స్థాయి బూట్‌క్యాంప్‌ శిక్షణ ప్రణాళిక చేస్తున్నాము. దీని ద్వారా సాంకేతికత, సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షణ అందించనున్నాము. ఉద్యోగుల ఎదుగుదలకు తగిన అవకాశాలు కల్పిస్తూనే సంస్ధ సైతం ఎదిగేలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. మా పని సంస్కృతిలో ఆవిష్కరణలెప్పుడూ కీలకంగా ఉంటాయి’’  అని చంద్ర తాళ్లూరి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఓటీఎస్‌ఐ అన్నారు.

 
‘‘ఓటీఎస్‌ఐ వద్ద తాము పని, వినోదంను ఖచ్చితంగా మేళవిస్తున్నాము. ప్రతి ఉద్యోగి తమలోని అత్యుత్తమతను వెలికి తీసుకునేందుకు మెరుగైన అవకాశాలను కల్పిస్తున్నాము. మేము కార్పోరేట్‌ ఈవెంట్లు, టోర్నమెంట్స్‌, లైవ్‌ క్రికెట్‌, బాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్స్‌ పోటీలు సైతం నిర్వహిస్తున్నాము. ప్రతి ఉద్యోగికీ మానసికోల్లాసం కలిగించేందుకు ఫ్యామిలీ ఈవెంట్లు, వార్షికోత్సవ వేడుకలు సైతం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరూ సహకారం పెంపొందించుకునే అవకాశాలనూ ఇస్తున్నాం’’అని ప్రదీప్‌ బోయిరి, సీనియర్‌ డైరెక్టర్‌, హ్యూమన్‌ రిసోర్శెస్‌, ఓటీఎస్‌ఐ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోకో కోలా కోసం కొరియన్ బ్యాండ్‌తో అల్లు అర్జున్ నటించిన పాట