Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్లూ వేరియంట్‌లో భారత్‌లో ₹19,999 ఫోన్‌ 3a లైట్‌ విడుదల చేసిన నథింగ్‌

Advertiesment
nothing phone

ఐవీఆర్

, శుక్రవారం, 28 నవంబరు 2025 (17:01 IST)
గురుగ్రామ్‌: లండన్ కేంద్రంగా ఉన్న టెక్నాలజీ కంపెనీ నథింగ్, భారత్‌లో నేడు ఫోన్ (3a) లైట్ సరికొత్త బ్లూ, క్లాసిక్ బ్ల్యాక్ అండ్ వైట్ రంగుల్లో ఆవిష్కరించింది. నథింగ్ (Nothing) ప్రత్యేకంగా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో కూడిన ఈ డివైస్ (6.77 ఇంచులు అమొలెడ్‌ డిస్‌ప్లే, ట్రూలెన్స్ (TrueLens) ఇంజిన్, 4.0తో 50 ఎంపీ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 7300-ప్రో చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. 8GB+ 128GB రకం ప్రారంభ ధర ₹20,999 ఇది బ్యాంక్‌ డిస్కౌంట్ల తర్వాత ₹19,999కు లభిస్తుంది. ఫోన్ (3a) లైట్ సేల్‌ భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్‌, విజయ్‌ సేల్‌, క్రోమా సహా అన్ని ప్రధాన రిటెయిల్‌ దుకాణాల్లో డిసెంబర్‌ ఐదు నుంచి లభిస్తుంది.
 
సొగసైన ట్రాన్స్‌పరెంట్‌ను కొనసాగిస్తూ IP54 రెసిస్టెన్స్‌తో ఫోన్(3a) లైట్, అల్యూమినియం ఇంటర్నల్‌ ఫ్రేమ్‌, తేలికపాటి నిర్మాణంతో ఉంటుంది. ఇది 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్‌తో 6.77-ఇంచుల ఫ్లెక్సిబుల్ అమొలెడ్‌(AMOLED) డిస్‌ప్లే కలిగి ఉంది. ట్రూలెన్స్ ఇంజిన్ 4.0తో కూడిన 50 MP ప్రధాన కెమెరా, అల్ట్రా XDR, నైట్ మోడ్, 30 FPS వద్ద 4K వీడియోను ఈ ఫోన్ కలిగి ఉంది. 16 MP ఫ్రంట్‌ కెమెరా అధిక-నాణ్యత సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు సపోర్టు చేస్తుంది. నథింగ్(Nothing) అభివృద్ధి చేసిన గ్లిఫ్ లైట్ సిస్టమ్ ఫంక్షనల్ నోటిఫికేషన్‌లు, కెమెరా కౌంట్‌డౌన్, కస్టమ్ కాంటాక్ట్ అలర్ట్స్‌ అందిస్తుంది.
 
మీడియాటెక్‌ డైమెన్సిటీ(MediaTek Dimensity) 7300 ప్రో శక్తితో కూడిన ఫోన్(3a) లైట్ 16 GB RAM(వర్చువల్‌ సహా), 2 TB వరకు పొడిగించుకోగల స్టోరేజ్‌ అందిస్తుంది. రోజంతా ఉపయోగానికి సరిపోయే 5000 mAh బ్యాటరీ కోసం 33 W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ పరికరం అండ్రాయిడ్‌(Android) 15 ఆధారంగా నథింగ్‌(Nothing) OS 3.5తో పనిచేస్తుంది. 3 సంవత్సరాల ప్రధాన అప్‌డేట్స్‌ సహా 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచులు అందుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?