ఎయిర్‌టెల్-బీఎస్ఎన్ఎల్‌లో కలిసి నోకియా సూపర్ ప్లాన్.. 5జీ కనెక్టివిటీకి సన్నాహాలు
ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ
ఎయిర్ టెల్ సహా శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్‌ను మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా దేశీయ టెలికామ్ దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసింది.
5జీ కనెక్టివిటీ లాంఛింగ్‌పై నోకియా భారత మార్కెట్ హెడ్ సంజయ్ మాలిక్ స్పందిస్తూ.. ప్రస్తుతం 5జీ కనెక్టివిటీకి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్‌లో సన్నాహక దశలో ఉన్నామన్నారు. ఇందుకోసం బెంగళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్లో ఓ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
భారత్‌లో 5జీ ప్రాధాన్యత.. వాటాదారుల అవసరాల రీత్యా ఈ సెంటర్‌ను ఉపయోగపడుతుందని సంజయ్ తెలిపారు. దేశంలో ఈ కొత్త టెక్నాలజీని త్వరగా ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, 2022 కల్లా ఇది జరగవచ్చునని చెప్పారు.