Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియో నుంచి రూ.259ల రీఛార్జ్‌ను ఉచితం.. నిజమేనా?

jioservice

సెల్వి

, సోమవారం, 11 మార్చి 2024 (16:17 IST)
పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ పుట్టిన రోజు కావడం.. అలాగే జూన్‌లో అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహ వేడుక నేపథ్యంలో జియో నుంచి 259 రూపాయల రీఛార్జ్‌ను ఉచితమని.. ఇది 30 రోజులపాటు ఉంటుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా ఉచిత రిఛార్జ్ ఆఫర్ కోసం ఆ లింక్ క్లిక్ చేయాలని పలువురు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. బర్త్ డే, పెళ్లి వేడుకల నేపథ్యంలో జియో కంపెనీ భారతీయ వినియోగదారులందరికీ ఈ ఆఫర్ అందిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
అయితే ఈ అంశం గురించి ఫాక్ట్ చేక్ చేయగా ఫేక్ అని తేలింది. ఇంకా అధికారిక వెబ్‌సైట్ జియోడాట్‌కామ్‌లో చూసినా కూడా అలాంటి ఆఫర్ ప్రకటించలేదు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి వార్తలు క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఖాతాల ఆదాయం- 3 రెట్లు పెంపు