Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్మార్ట్ ఫోన్ ఇంట్లో వుంటే చాలు.. వ్యాధికారిక క్రిములు ఇట్టే మాయం..!

Advertiesment
Germicidal Smart Fan
, గురువారం, 24 జూన్ 2021 (21:36 IST)
Smart Fan
కరోనాతో ఇప్పటికే జనాలు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధికారిక క్రిములను ఇంట్లోనే నివారించేందుకు కొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫ్యాన్ ఒకటి వచ్చింది. అదే.. జర్మిసిడల్ స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫ్యాన్ ఇంట్లో ఉంటే.. ఎలాంటి వ్యాధికారిక క్రిములైన ఇట్టే మాయం చేసేస్తుంది.
 
ప్రత్యేకించి వ్యాధికారిక క్రిములను నాశనం చేసేందుకు అల్ట్రా జెర్మిసిడాల్ అనే స్మార్ట్ ఫ్యాన్‌ను డిజైన్ చేసింది మోడ్రాన్ ఫామ్స్ అనే సంస్థ. వాస్తవానికి సీలింగ్ ఫ్యాన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్ కనిపెట్టలేదంటున్నారు మోడ్రాన్ ఫామ్స్, డబ్ల్యూఏసీ సంస్థ కో-సీఈఓ డార్క్ వాల్డ్ పేర్కొన్నారు. 
 
కానీ, ఇప్పుడు సీలింగ్ మార్కెట్లో కూడా కొత్త రకం టెక్నాలజీ కలిగిన ఈ స్మార్ట్ ఫ్యాన్ వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ పేటెంట్ పెండింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దాంతో సీలింగ్ ఫ్యాన్ మాదిరిగా తిరుగుతుంది. తద్వారా ఇంట్లోని గదిలో అన్నివైపులా గాలి వస్తుంది. అప్పుడు గాలిలో కంటికి కనిపించని వ్యాధికారక క్రిములను నివారించగలదని కంపెనీ చెబుతోంది.  
 
ఫీచర్స్ 
ఈ అల్ట్రా డిజైనర్ సీలింగ్ ఫ్యాన్.. 54 అంగుళాల సైజు ఉంటుంది. 
సాధారణ ఫ్యాన్ లానే మూడు రెక్కలు ఉంటాయి. 
నల్లని బ్లేడ్‌లు ఉంటాయి. 
అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ హార్డ్ వేర్, ABS బ్లేడులను కలిగి ఉంది. 
 
ఔట్ డోర్ లలో కూడా ఈ స్మార్ట్ ఫ్యాన్ పనిచేస్తుంది. 
ఇందులో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. 
హ్యాండ్ రిమోట్ కంట్రోల్ ద్వారా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. 
ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. 
గాలి దశను కూడా మార్చుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాష్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్ గణేష్ కె ఇంజనీరు కావాలనే జీవితకాలం కలను నెరవేర్చుకున్నాడు