షియోమీ నుంచి ఎంఐ నోట్‌బుక్ 14 (ఐసీ) పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదలైంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ 720పి హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ను ఏర్పాటు చేశారు. 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే లభిస్తుంది. ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ, 2జీబీ ఎన్‌వీడియా ఎంఎక్స్ 250 గ్రాఫిక్స్ కార్డ్ లభిస్తాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో 46 వాట్ల బ్యాటరీని అమర్చారు. అందువల్ల 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. చార్జింగ్ కూడా వేగంగా అవుతుంది. 0 నుంచి 50 శాతం వరకు చార్జింగ్ అయ్యేందుకు 35 నిమిషాల సమయం పడుతుంది. ఎంఐ నోట్‌బుక్ 14 (ఐసీ) ల్యాప్‌టాప్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లో రూ.43,999 ధరకు లభిస్తోంది. 512జీబీ ఎస్ఎస్‌డీ వేరియెంట్ ధర రూ.46,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, హోం స్టోర్, ఇతర రిటెయిల్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
ఎంఐ నోట్‌బుక్ 14 (ఐసీ) ఫీచర్లు…
* 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.6 గిగాహెడ్జ్ ఇంటెల్ కోర్ ఐ5 10వ జనరేషన్ ప్రాసెసర్, 2జీబీ ఎన్‌వీడియా గ్రాఫిక్స్ కార్డ్
* 8జీబీ ర్యామ్, 256/512 జీబీ ఎస్ఎస్‌డీ, విండోస్ 10 హోం ఎడిషన్
* బిల్టిన్ హెచ్‌డీ వెబ్‌క్యామ్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 46వాట్ల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్