వందశాతం లైకా షేర్లను కొనేసిన మాస్మోవిల్.. ఏంటి సంగతి?

మంగళవారం, 3 మార్చి 2020 (17:45 IST)
Lyca
స్పెయిన్ అగ్రగామి టెలికాం సంస్థ మాస్మోవిల్ లైకా టెలికాం రంగ సంస్థను కొనుగోలు చేసింది. లండన్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో 23 దేశాలకు టెలికాం సేవలు అందిస్తున్న లైకా మొబైల్ నెట్‌వర్క్ సంస్థ ప్రస్తుతం మాస్మోవిల్ చేతిలోకి వెళ్లింది. గత 2010వ సంవత్సరం స్పెయిన్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభించిన లైకా, 1.5 మిలియన్ల కస్టమర్లను కలిగివుంది. 
 
ఈ నేపథ్యంలో వున్నట్టుండి వందశాతం షేర్లను లైకా.. స్పెయిన్ సంస్థ మాస్మోవిల్ వద్ద విక్రయించడం జరిగింది. తద్వారా లైకా రూ.3,100 కోట్లను పొందింది. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు లైకా పేరిటనే టెలికాం సేవలు కొనసాగుతాయని సంస్థ ప్రకటించింది. 
 
అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నామని.. టెలికాం రంగంలో ఉన్నత సేవలు అందించామని లైకా ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం తమ షేర్లను ఇంకో కంపెనీకి అమ్మేయడంపై సానుకూలతనే లైకా ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హైదరాబాద్ టెక్కీకి కరోనా.. 80 మందితో కాంటాక్ట్.. అసలు సంగతేంటి?