Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్‌బుక్ మాతృ సంస్థకు కష్టాలు.. 24 శాతం కుదేలు.. చరిత్రలోనే అతిపెద్ద డ్రాప్

Advertiesment
ఫేస్‌బుక్ మాతృ సంస్థకు కష్టాలు.. 24 శాతం కుదేలు.. చరిత్రలోనే అతిపెద్ద డ్రాప్
, శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (12:15 IST)
ఫేస్‌బుక్ మాతృ సంస్థకు కష్టాలు తప్పలేదు. ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్‌ల షేర్లు 24 శాతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద డ్రాప్. మెటా అంచనాల నుండి బలహీన ఫలితాల కారణంగా స్టాక్‌లో పతనం కనిపించింది. మార్క్ జుకర్‌బర్గ్ స్వంత సంపద కూడా $ 31 బిలియన్ల తగ్గిపోయింది. ఒక్క రోజులో ఏ కంపెనీ చూసినా ఇదే అతిపెద్ద పతనం. 
 
మరోవైపు అడ్వర్టైజ్ మెంట్ ప్రకటన వృద్ధిలోనూ భారీగా తగ్గుదల కనిపించింది. ఈ ప్రాంతంలో ప్రకటనల ద్వారా కంపెనీ అత్యధికంగా డబ్బు సంపాదించింది. ఫేస్‌బుక్ రోజువారీ యాక్టివ్ యూజర్లు 2020 నాల్గవ త్రైమాసికంలో 1.93 బిలియన్ల నుంచి గత త్రైమాసికంలో 1.92 బిలియన్లకు చేరుకున్నారు. ఈ క్షీణత కారణంగానే గ్లోబల్ మార్కెట్‌లో ఫేస్‌బుక్ డెయిలీ యూజర్ల సంఖ్యను మరింత తగ్గించింది. ఇది కంపెనీ చరిత్రలోనే మొదటిసారి అని కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.  
 
ఫలితంగా ఒకేరోజు జుకర్‌బర్గ్ స్వంత సంపద $31 బిలియన్ల తగ్గిపోగా.. గ‌తంలో ఎలన్ మస్క్ సంపదలో అస్థిరమైన కల్లోలం దీనికి పోటీగా ఉంది. గ‌తేడాది నవంబర్‌లో టెస్లా ఇంక్. షేర్లు పడిపోవడంతో ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి ఒక రోజులో $35 బిలియన్లను కోల్పోయాడు. ఫేస్‌బుక్ ప్రధాన సమస్యలను సాధ్యమైనంత తొందరగా Meta పరిష్కరించలేకపోతే.. సోషల్ ప్లాట్‌ఫారమ్ మార్కెట్ విలువలో భారీ క్షీణతను చూస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ