దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 5జీ నెట్‌వర్క్ అంచలంచెలుగా అందుబాటులోకి వస్తుంది. దీంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లను మార్చి 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ రూ.10 వేలకే 5 జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో లావా బ్లేజ్ 5జీ మొబైల్‌ను ప్రదర్శించింది. 5జీ స్మార్ట్ ఫోన్లలో ఇది ఎంతో చౌకైన ఫోన్. దీపావళి నుంచి ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే,
హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్. మీడియా టెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్. 8ఎంపీ ఫ్రంట్ కెమెరా. 50 ఎంపీ రియర్ కెమెరా. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 90హెచ్‍జడ్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ లాంటి ఫీచర్లతో బ్లూ, గ్రీన్ కలర్స్‌లో అందుబాటులోకితెచ్చింది.