అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో ట్రంప్.. కాగ్నిజెంట్ ఐటీ యూనియన్ ప్రారంభం..
అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస
అప్పట్లో ఆర్థిక మాంద్యం.. ఇప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఐటీ ఉద్యోగులు జడుసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగమంటేనే వద్దు బాబోయ్ అనుకుంటున్నారు. ఐటీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఏమీ పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమిళనాడులోని కాగ్నిజెంట్ కంపెనీ తొలగించిన ఉద్యోగులు ఐటీ ఫారమ్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు.
మొత్తం రాష్ట్రంలో 4.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. అందులో 100 మంది మాత్రమే సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో 2015లో టీసీఎస్ కంపెనీ వందల మందిని ఉద్యోగం నుండి తొలగించడంతో తమిళనాడు ప్రభుత్వం ఐటీ రంగాన్ని కూడా ట్రేడ్ యూనియన్‌లో చేర్చింది. ఈ విషయంలో కర్ణాటక ముందడుగు వేయలేదు. అయితే కాగ్నిజెంట్ దెబ్బతో 13వేల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇదే కనుక కొనసాగితే ఐటీ ఉద్యోగుల సమ్మె చేస్తామంటూ ఆ ఫారమ్ ఛీఫ్ పరిమళ హెచ్చరించారు. ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుండే అత్యధిక ఐటీ ఉద్యోగులు ఉండటం గమనార్హం.