Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 జాబ్స్ మటాష్ : వరల్డ్ బ్యాంక్ నివేదిక

భారతదేశంలోని ఐటీ ఉద్యోగాలు వాటి స్థితిగతులపై ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొ

Advertiesment
IT sector
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (16:23 IST)
భారతదేశంలోని ఐటీ ఉద్యోగాలు వాటి స్థితిగతులపై ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహారశైలి ప్రపంచ ఐటీ రంగానికి గొడ్డలివేటుగా మారనుందని పేర్కొంది. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో, దేశీయ ఐటీ దిగ్గజాలు సైతం ఆత్మరక్షణలోకి జారుకుంటున్నాయి. ఉద్యోగుల సంఖ్య కంటే కూడా ఆటోమేషన్‌పైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. బీపీవో సేవల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నాయి.
 
టీసీఎస్, విప్రోలాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు అవసరమైతే జీతాలు పెంచి, టెక్నాలజీపరంగా వారికి మరిన్ని బాధ్యతలను అప్పగించాలని ఈ సంస్థలు భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, మొత్తం మీద ఇండియాలోని ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అభిప్రాయపడింది. 
 
ఇప్పటికే ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది, విద్య ఉంటే ఎక్స్‌పీరియన్స్ లేదని, ఎక్స్‌పీరియన్స్ ఉంటే స్కిల్స్ లేవంటూ ఐటీ కంపెనీలు మెలికలు పెడుతున్నాయి. ఇక ఆటోమేషన్ విధానం అమల్లోకి వస్తే, ఎంటెక్, బీటెక్‌లు పూర్తి చేసుకుని వచ్చే ఇంజినీర్లకు ఉద్యోగాలు దొరకడం దుర్లభంగా మారుతుందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#sasikala 'The told story', కరుణానిధి ముందు పెళ్లి, జయలలితను వీడియో షూటింగ్...