Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#sasikala 'The told story', కరుణానిధి ముందు పెళ్లి, జయలలితను వీడియో షూటింగ్...

అవును. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులోనే కాదు దేశంలోనూ మారుమోగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఒకట్రెండు రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న శశికళ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలింతకీ ఈ శశికళ చరిత్ర ఏంటయా అని చూస్తే...

Advertiesment
#sasikala
, సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (15:52 IST)
అవును. ఇప్పుడు ఈ పేరు తమిళనాడులోనే కాదు దేశంలోనూ మారుమోగుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఒకట్రెండు రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న శశికళ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలింతకీ ఈ శశికళ చరిత్ర ఏంటయా అని చూస్తే... 
 
శశికళ 1957వ సంవత్సరంలో జన్మించారు. తిరుత్తరాయ్ పూండిలో పెరిగి పెద్దయిన శశికళ ఎం. నటరాజన్ ను స్వయంగా డీఎంకే కరుణానిధి సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పట్లో నటరజాన్ తమిళనాడు ప్రభుత్వానికి పీర్వోగా పనిచేస్తుండేవారు. అదేసమయంలో ఆయన తన పనితనంతో అప్పటి కడలూర్ కలెక్టర్ వి.ఎస్ చంద్రలేఖ ఐఎఎస్‌కు  చేరువయ్యారు. అలా అలా ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ కు మరింత చేరువయ్యారు.
 
ముఖ్యమంత్రితోనే సన్నిహితంగా వుంటే ఇక చెప్పేదేముంది. అలా మొదలయిన ఆయన పరిచయం తన భార్య శశికళను కూడా మెల్లగా అన్నాడీఎంకే పార్టీలో చొప్పించగలిగారు. అదికూడా మళ్లీ కలెక్టర్ వి.ఎస్ చంద్రలేఖ సహాయంతోనే. పార్టీ కార్యక్రమాలను రికార్డ్ చేసే వీడియోగ్రాఫర్ గా ఆమె పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టి క్రమంగా జయలలితకు దగ్గరయ్యారు. 
 
ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపధ్యంలో డిసెంబరు 19, 2011న జయలలిత ఆమెను, ఆమె భర్త నటరాజన్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. మళ్లీ తను చేసిన తప్పులకు క్షమాపణలు వేడుకుంటూ శశికళ లేఖ రాయడంతో అమ్మ కరుణించి ఆమెను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత డిసెంబరు 2016లో జయలలిత మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అనేక రాజకీయ పరిణామాల మధ్య రెండు నెలలు తిరక్కుండానే శశికళ ముఖ్యమంత్రి పోస్టుకు రెడీ అయిపోవడం ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే ముచ్చట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితను విషమ పరిస్థితుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.. మరణం వెనుక కుట్రలేదు : రిచర్డ్ బాలే